పెరిగిన భూ గర్భజలాలు

ABN , First Publish Date - 2020-10-01T10:46:56+05:30 IST

జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షం కురియగా, మిగిలిన మండలాల్లో సాధారణ వర్షం నమోదైంది. దీంతో

పెరిగిన భూ గర్భజలాలు

సాధారణంకంటే ఎక్కువ వర్షపాతం

ఏడు మండలాల్లో పొంగిపొర్లిన చెరువులు, కుంటలు


(ఆంధ్రజ్యోతి, జగిత్యాల)

జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షం కురియగా, మిగిలిన మండలాల్లో సాధారణ వర్షం నమోదైంది. దీంతో జిల్లాలో ఏడు మండలాల్లో  వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. గతంలో లేని విధంగా జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.


జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు..

జగిత్యాల జిల్లాలో గతంలో లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఇప్పటికే వర్షపాతం నమోదైంది. జగిత్యాల, రాయికల్‌, గొల్లపల్లి, పెగడపల్లి, కొడిమ్యాల, కోరుట్ల, మేడిపల్లి మండలాల్లో సాధారణంకంటే మించి వర్షాలు కురిశాయి. మిగిలిన 11 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జగిత్యాలలో సెప్టెంబరు 27 వరకు గత ఏడాది 1079.1 మిల్లీ మీటర్ల వర్షం కురియగా, ఈ ఏడాది 1121.2 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. రాయికల్‌ మండలంలో గత ఏడాది 1007.2 మి.మీ. వర్షం కురియగా, ఈ ఏడాది ఇప్పటికే 1007.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గొల్లపల్లి మండలంలో గత ఏడాది 901.8 మిల్లీ మీటర్ల వర్షం పడగా, ఈ ఏడాది ఇప్పటికే 956.3 మిల్లీ మీటర్ల వర్షం పడింది. పెగడపల్లి మండలంలో గత ఏడాది 915.6 మిల్లీ మీటర్ల వర్షం పడగా, ఈ ఏడాది ఇప్పటికే 1006.1 మిల్లీ మీటర్ల వర్షం పడింది. గత ఏడాది కోరుట్ల మండలంలో 895.4 మిల్లీ మీటర్ల వర్షం పడగా, ఈ ఏడాది 912.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.


కొడిమ్యాల మండలంలో ఎప్పుడు వర్షాభావ పరిస్థితులు నెలకొనగా గత ఏడాది 746.2 మిల్లీ మీటర్లు కురవగా, ఈ ఏడాది ఇప్పటికే 1065 మిల్లీ మీటర్ల వర్షం పడింది. కాగా ధర్మపురి మండలంలో 835.3 మిల్లీ మీటర్లు, సారంగాపూర్‌ మండలంలో 913.6 మిల్లీ మీటర్లు, మల్యాల మండలంలో 906.6 మిల్లీ మీటర్లు, వెల్గటూర్‌ మండలంలో 1073 మిల్లీ మీటర్లు, మెట్‌పల్లి మండలంలో 855.8 మిల్లీ మీటర్లు, ఇబ్రహీంపట్నం మండలంలో 796.2 మిల్లీ మీటర్లు, కథలాపూర్‌ మండలంలో 806 మిల్లీ మీటర్లు, మల్లాపూర్‌ మండలంలో 904.2 మిల్లీ మీటర్ల వర్షం పడింది. జిల్లావ్యాప్తంగా గత ఏడాది ఇప్పటికే 14293.9 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది.


చెరువులు, కుంటలకు జల కల..

జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలకు జల కల వచ్చింది. జగిత్యాల జిల్లాలో 1172 చెరువులు ఉండగా, దాదాపు అన్ని చెరువుల్లోకి భారీగా నీరు చేరింది. జగిత్యాల, మేడిపల్లి, గొల్లపల్లి, పెగడపల్లి, మల్యాల, రాయికల్‌, సారంగాపూర్‌, వెల్గటూర్‌, కోరుట్ల, బీర్‌పూర్‌ మండలంలోని చాలా చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రైతులు చెరువులకు గండ్లు పెట్టాల్సి వచ్చింది. 

Updated Date - 2020-10-01T10:46:56+05:30 IST