వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు

ABN , First Publish Date - 2021-04-18T21:41:54+05:30 IST

వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మరో రికార్డు సృష్టించింది. కేవలం 92 రోజుల్లోనే ఏకంగా 122 మిలియన్ల మందికి టీకాలు

వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మరో రికార్డు సృష్టించింది. కేవలం 92 రోజుల్లోనే ఏకంగా 122 మిలియన్ల మందికి టీకాలు వేసిన తొలి దేశంగా రికార్డులకెక్కింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. 12 కోట్ల మందికి టీకాలు వేసేందుకు అమెరికాకు 97 రోజులు పట్టగా, చైనాకు 108 రోజులు పట్టిందని ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో గత 24 గంటల్లోనే 2.6 మిలియన్ల మందికి టీకాలు వేశారు. ఫలితంగా దేశవ్యాప్తంగా మొత్తం టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 12,26,22,590కి పెరిగింది.  


దేశంలో ఈ ఏడాది జనవరి 16న వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, రక్షణ సిబ్బంది, పోలీసులు, ఇతర పారామిలటరీ సిబ్బందికి వ్యాక్సిన్లు వేశారు. మార్చి 1న ప్రారంభమైన రెండో దశలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్లు వేశారు.  ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్లు ఇస్తున్నారు.  

Updated Date - 2021-04-18T21:41:54+05:30 IST