భారత్‌, చైనాపై ఐఎస్‌ఎస్‌ కూలితే!

ABN , First Publish Date - 2022-02-27T17:24:33+05:30 IST

తమతో సహకరించకపోతే, ఐఎస్‌ఎస్‌ను ఎవరు కాపాడతారని..

భారత్‌, చైనాపై ఐఎస్‌ఎస్‌ కూలితే!

అప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు?: రష్యా


మాస్కో: తమతో సహకరించకపోతే, ఐఎస్‌ఎస్‌ను ఎవరు కాపాడతారని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రోస్‌కాస్మోస్‌’ ప్రత్యర్థి దేశాలను పశ్నించింది. ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నియంత్రణ తప్పి భారత్‌-చైనా మీద కూలిపోయే అవకాశం ఉంది. ఈ సాకుతో భారత్‌, చైనాను మీరు (అమెరికా) బెదిరిస్తున్నారా? అమెరికా లేదా యూర్‌పపైనా ఐఎస్‌ఎస్‌ కూలిపోయే అవకాశం ఉంది. అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారు? రష్యా మీదుగా ఐఎస్‌ఎస్‌ ప్రయాణించదు. ముప్పంతా మీకే (అమెరికా, యూరప్‌) పొంచి ఉంది. ఐఎస్‌ఎస్‌ను రష్యా ఇంజన్లే నియంత్రిస్తున్నాయి. నియంత్రణ మా చేతుల్లోనే ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి’’ అని రోస్‌కాస్మోస్‌ డైరెక్టర్‌ జనరల్‌ దిమిత్రీ రోగోజిన్‌ ట్వీట్‌ చేశారు. అమెరికా ఆంక్షల కారణంగా ఐఎస్‌ఎస్‌లో ఇరు దేశాల మధ్య సహకారం దెబ్బతింటుందని అమెరికాను ఆయన హెచ్చరించారు. ఐఎస్‌ఎస్‌ ప్రోగ్రాంలో రష్యా, అమెరికా కీలక భాగస్వాములు.



Updated Date - 2022-02-27T17:24:33+05:30 IST