సరిహద్దుల వెంబడి సరికొత్త సవాళ్ళు : ఆర్మీ చీఫ్

ABN , First Publish Date - 2021-04-06T22:49:53+05:30 IST

భారత దేశం సరిహద్దుల్లో సరికొత్త సవాళ్ళను ఎదుర్కొంటోందని ఇండియన్ ఆర్మీ

సరిహద్దుల వెంబడి సరికొత్త సవాళ్ళు : ఆర్మీ చీఫ్

చెన్నై : భారత దేశం సరిహద్దుల్లో సరికొత్త సవాళ్ళను ఎదుర్కొంటోందని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనే చెప్పారు. ఇటువంటి పరిణామాలన్నిటినీ శిక్షణ పొందుతున్న సైనికాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పారు. తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (డీఎస్ఎస్‌సీ)లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 


‘పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో పరిణామాలు, భారత సైన్యపు భవిష్యత్తు మార్గసూచి’ అనే అంశంపై జనరల్ నరవనే మాట్లాడారు. సరిహద్దుల్లో ఎదురవుతున్న సరికొత్త సవాళ్ళను శిక్షణ పొందుతున్న సైనికాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పారు. 


76వ స్టాఫ్ కోర్సుకు హాజరవుతున్న ఫ్యాకల్టీ, అధికారులను ఉద్దేశించి జనరల్ నరవనే మాట్లాడారు. ఈ కాలేజీలో ఆయన రెండు రోజులపాటు ఉంటారు. శిక్షణ కార్యక్రమాల గురించి డీఎస్ఎస్‌సీ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ ఎంజేఎస్ కహ్లాన్ వివరించారు. త్రివిధ దళాల మధ్య ‘‘జాయింట్‌మ్యాన్‌షిప్’’పై వృత్తిగత సైనిక శిక్షణను ఈ కోర్సులో చేర్చినట్లు తెలిపారు. ఈ వివరాలను ఆర్మీ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.


మన దేశానికి పశ్చిమ సరిహద్దులో పాకిస్థాన్, ఉత్తర సరిహద్దులో చైనా ఉన్నాయి. ఈ రెండు దేశాల నుంచి సవాళ్ళు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-04-06T22:49:53+05:30 IST