కతువాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్

ABN , First Publish Date - 2021-08-03T17:49:45+05:30 IST

కతువాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్

కతువాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్

జమ్మూ: జమ్మూలోని కతువా జిల్లా రంజిత్ సాగర్ డ్యాం సమీపంలో భారత ఆర్మీ హెలికాప్టర్ ఒకటి మంగళవారంనాడు కుప్పకూలింది.  పైలట్లు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. రొటీన్ ట్రిప్‌లో భాగంగా ఆర్మీ ఏవియేషన్ ఏఎల్‌హెచ్ ధ్రువ హెలికాప్టర్ వెళ్తుండగా ప్రమాదానికి గురయిందని అధికారులు తెలిపారు. ఇది వెపన్ సిస్టం ఇంటిగ్రేటెడ్ హెలికాప్టర్‌ అని, పఠాన్‌కోట్ (పంజాబ్) నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపాయి. ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టాయి.

Updated Date - 2021-08-03T17:49:45+05:30 IST