Advertisement
Advertisement
Abn logo
Advertisement

NEET Exam కు హాజరయ్యే విద్యార్థులకు కువైత్‌లోని Indian Embassy కీలక సూచనలు..

కువైత్ సిటీ: ఇంతకుముందెన్నడూ లేనివిధంగా తొలిసారి దేశం వెలుపల నీట్ ఎగ్జామ్ కోసం భారత ప్రభుత్వం కువైత్‌కు పరీక్ష కేంద్రాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో కువైత్‌లోని భారత ఎంబసీ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 12న(ఆదివారం) ఎంబసీ ప్రాంగణంలోనే ఈ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎంబసీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కీలక సూచనలు చేసింది.


1. ఎంబసీ ప్రాంగణంలో దైయా ప్రాంతంలోని అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్‌లో ఉన్న డిప్లామాటిక్ ఎన్‌క్లేవ్‌లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంబసీ పేర్కొంది. నేషనల్ టేస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) మార్గదర్శకాల ప్రకారం ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటించింది.

2. ఎన్‌టీఏ నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్ష సెప్టెంబర్ 12న(ఆదివారం) కువైత్ కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఉంటుంది. అది కూడా పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. అంటే ఓఎంఆర్ సీట్‌పై బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో బబుల్స్ ఫీల్ చేయాల్సి ఉంటుంది. పరీక్ష కోసం ఉపయోగించే పెన్‌ను విద్యార్థులకు ఎన్‌టీఏ‌నే అందిస్తుందని ఎంబసీ వెల్లడించింది.

3. పరీక్ష మొత్తం సమయం మూడు గంటలుగా పేర్కొంది. 

4. ఎన్‌టీఏ గైడ్‌లైన్స్ ప్రకారం భారత్ బయట నిర్వహిస్తున్న ఈ పరీక్షను కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది. 


ఇవి కూడా చదవండి..

కన్నవాళ్లు కాదనుకున్న Gujarat చిన్నారిని.. American జంట అక్కున చేర్చుకోబోతోంది..

Income Tax కట్టనంటూ అడ్డం తిరిగిన NRI.. మొత్తానికి సుప్రీంకోర్టు ఏం తేల్చిందంటే.. 


5. విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచి 11.00 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుంది. కనుక అడ్మిట్ కార్డులతో ఈ సమయంలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అంతేగాక అడ్మికార్డుల్లో భారత కాలమానం ప్రకారం సమయం ఉంటుందని, దాన్ని కువైత్ కాలమానానికి అనుగుణం చూసుకోని విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్‌కు రావాల్సిందిగా ఎంబసీ తెలియజేసింది. 

6. ఉదయం 11.00 గంటల తర్వాత ఎట్టిపరిస్థితిలో విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. కనుకు విద్యార్థుల పరీక్ష సమయానికి ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని ఎంబసీ సూచించింది.

7. విద్యార్థులు ఎన్‌టీఏ వెబ్‌సైట్ https://neet.nta.nic.in నుంచి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం అడ్మిట్ కార్డుపై ఎన్‌టీఏ వెల్లడించిన సూచనలు జాగ్రత్తగా చదువుకుని, వాటిలో పేర్కొన్న విధంగా వస్తువులను మాత్రమే పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. నిషేధిత వస్తువులు లేదా పరికరాలను ఎట్టిపరిస్థితిలో తీసుకెళ్లకూడదు. 

8. ఇంటి నుంచి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఎన్-95 మాస్క్ ధరించాల్సి ఉంటుంది. అయితే, పరీక్ష కేంద్రానికి వచ్చిన తర్వాత దాని స్థానంలో నిర్వాహకులు ఇచ్చే మాస్క్ వేసుకోవడం తప్పనిసరి.

9. ఎంబసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ డెస్క్ ఉదయం 8.30 గంటల నుంచి పని చేస్తుంది. ఏదైనా సమస్య ఉంటే అడ్మిట్ కార్డు, ఐడీ ప్రూఫ్‌తో విద్యార్థులు రిజిస్ట్రేషన్ డెస్క్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. అక్కడికి విద్యార్థుల తల్లిదండ్రులను అనుమతించరు. 

10. ఎన్‌టీఏ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు డ్రెస్ కోడ్‌ను ఫాలో కావాల్సి ఉంటుంది. 

11. పరీక్ష సమయం ముగిసే వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపించరు. 

12. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కువైత్ ఆరోగ్యశాఖ కోవిడ్ నిబంధనలను పాటించడం తప్పనిసరి. 

13. విద్యార్థులు రిజిస్ట్రేషన్ డెస్క్ వద్ద ఎమర్జెన్సీ కాంటాక్ట్ కింద వారి పేరెంట్స్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. 

14. పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులను ఫస్ట్ కమ్ ఫస్ట్ ఔట్ విధానంలో బయటకు వదలడం జరుగుతుంది. 

15. ఎగ్జామ్ తేదీ కంటే ముందు అంటే.. 11న(మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) విద్యార్థులు ఒకసారి పరీక్ష కేంద్రాన్ని సందర్శించే అవకాశం కల్పించింది. 

16. ఇక పరీక్ష ఉన్న రెండు రోజులు  సెప్టెంబర్ 9, 12 తేదీల్లో ఎంబసీ పబ్లిక్ సర్వీలు అన్నింటినీ పూర్తిగా నిలివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ రెండు రోజులు కేవలం అత్యావసర కాన్సులర్ సర్వీసులు మాత్రమే ఉంటాయి.

17. ఇతర సందేహాల నివృత్తి కోసం [email protected] లేదా [email protected] ఈ-మెయిల్ చేయాల్సిందిగా ఎంబసీ పేర్కొంది.


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement