14 రాష్ట్రాలకు 15,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా

ABN , First Publish Date - 2021-05-23T21:58:25+05:30 IST

దేశవ్యాప్తంగా ఇంతవరకూ 14 రాష్ట్రాలకు 15,284 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్...

14 రాష్ట్రాలకు 15,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంతవరకూ 14 రాష్ట్రాలకు 15,284 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను (ఎల్ఎంఓ) 936 ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. ఆదివారం ఉదయం తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌కు అసోంకు చేరిందని, 4 ట్యాంకర్లలో 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను అసోంకి డెలివర్ చేశామని రైల్వే శాఖ తెలిపింది. 234కు పైగా ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను ఇంతవరకూ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నడిపినట్టు పేర్కొంది. రోజువారీ 800 మెట్రిక్ టన్నుల చొప్పున ఎల్ఎంఓలను డెలివరీ చేసినట్టు పేర్కొంది. ఆదివారంనాడు 31 ట్యాంకర్లలో 569 మెట్రిక్ టన్నుల ఎల్ఎంఓ‌తో తొమ్మిది ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను నడిపారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇంతవరకూ చేరుకున్న రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అసోం ఉన్నాయి. గత 29 రోజులుగా ఈ ప్రత్యేక రైళ్లు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాయి.   


Updated Date - 2021-05-23T21:58:25+05:30 IST