covid: ఇంకా ఐదు రాష్ట్రాల్లో కేసులు అధికం

ABN , First Publish Date - 2021-07-27T17:21:15+05:30 IST

దేశంలోని ఐదు రాష్ట్రాలను కొవిడ్ మహమ్మారి వీడటం లేదు. కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల సంఖ్య అధికంగా...

covid: ఇంకా ఐదు రాష్ట్రాల్లో కేసులు అధికం

న్యూఢిల్లీ : దేశంలోని ఐదు రాష్ట్రాలను కొవిడ్ మహమ్మారి వీడటం లేదు. కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. కేరళ రాష్ట్రం కరోనా కేసుల్లోనే అగ్రస్థానంలో ఉంది. దేశంలో ఆదివారం ఒక్కరోజు 39,361 కరోనా కేసులు నమోదు కాగా, ఒక్క కేరళలో  మాత్రమే 17,466 కేసులు నమోదైనాయి.కేరళలో గత వారంలోనే 16 శాతం కరోనా కేసులు పెరిగాయి.కేరళతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర,  తమిళనాడు రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా వెలుగు చూశాయి.ఒడిశా రాష్ట్రంలో కరోనాతో మరణాల సంఖ్య మే 1వతేదీన 10 కాగా, జులై 26కల్లా 65 మందికి పెరిగింది.దక్షిణాది రాష్ట్రాల్లో రోజువారీ కరోనా పరీక్షల శాతంతోపాటు వ్యాక్సినేషన్ శాతం కూడా తగ్గింది. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇంకా నమోదు అవుతండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.







Updated Date - 2021-07-27T17:21:15+05:30 IST