ఆన్‌లైన్‌లోనే ఇందిరమ్మ ఇళ్లు

ABN , First Publish Date - 2020-08-05T11:32:08+05:30 IST

పన్నెండేళ్ల క్రితం ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.

ఆన్‌లైన్‌లోనే ఇందిరమ్మ ఇళ్లు

 స్థల వివాదంతో ఆగిన నిర్మాణాలు 8 త్రిశంకు స్వర్గంలో  400 మంది లబ్ధిదారులు

12 ఏళ్లుగా ఇదే తంతు

తాజాగా నమోదు చేస్తుంటే దరఖాస్తుల తిరస్కరణ


కంభం, ఆగస్టు 4 : పన్నెండేళ్ల క్రితం ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇంతలో ఓ వ్యక్తి స్థలం తనదంటూ కోర్టుకెక్కారు. ఇళ్ల పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత కొత్తగా దరఖాస్తు చేస్తున్నా ఆన్‌లైన్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులంటూ తిరస్కరణకు గురవుతున్నాయి. అప్పట్నుంచి లబ్ధిదారులు అద్దె ఇళ్లలోనే మగ్గుతున్నారు. వివరాల్లోకెళ్తే...కంభం పంచాయతీ పరిధిలో 2007-08లో సర్వే నెంబరు 768లో ప దెకరాల స్థలంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. రావిపాడుకు వెళ్లే రహదారి పక్కన మాలకొండ దగ్గర పుచ్చలపల్లి సుందరయ్య కాలనీ పేరు పెట్టి 400 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.



కొందరు బేస్‌లెవెల్‌, మరికొందరు గోడలు లేపిన సమయంలో ఓ వ్యక్తి ఆ స్థలం తనదేనంటూ కోర్టుకు వెళ్లడంతో గృహనిర్మాణాలు నిలిచిపోయాయి. మధ్యలో మళ్లీ ఇళ్ల కోసం దరఖాస్తు చేసినా ‘మీరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు. మళ్లీ ఇళ్లు మంజూరు కావు’ అని ఆన్‌లైన్‌లో చూపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారని అప్పటి లబ్ధిదారులు వాపోతున్నారు. నేటికీ అద్దె ఇంట్లోనే మగ్గిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థల వివాదంలో కోర్టుకు వెళ్లిన వ్యక్తికే ఇటీవల అనుకూల తీర్పు వచ్చింది. వారందరూ కాళ్లు అరిగేలా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్యను ప్రత్యేక దృష్టితో పరిశీలించి పరిష్కరించేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ తమకు మంజూరు కావడంలేదని వారు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఇళ్లు మంజూరు చేయించాలని కోరుతున్నారు.


జిల్లాలో సాగుకు పరిస్థితులన్నీ అనుకూలించినా పంటలు వేయలేని స్థితి నెలకొంది. అందుకు కరోనా వైరస్‌ వ్యాప్తి కారణమైంది. ప్రధానంగా కౌలు రైతులు పొలాలు తీసుకునేందుకు సందిగ్ధంలో ఉన్నారు. కొన్నేళ్లుగా ప్రకృతి కలిసి రాకపోవడం, పెట్టుబడులు పెరగడం, దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడం, ధరల మాయాజలం.. ఏదైతేనేం వ్యవసాయం నష్టాల బాటలో నడుస్తోంది. దీంతో రెండుమూడేళ్ల క్రితం వరకూ గణనీయంగా ఉన్న కౌలు ధరలు గతేడాది కొంతమేర తగ్గాయి. ఈసారి మరింత దిగజారాయి. చాలాచోట్ల అసలు పొలం కౌలుకు అడిగేవారు కనిపించడం లేదు.


జిల్లాలో కౌలు రైతులు అధికం. కానీ ఇప్పుడు వారంతా కాడి పట్టడానికి భయపడుతున్నారు. ప్రత్యేకంగా గతేడాది పంటలసాగు వారిని  కోలుకోలేని దెబ్బతీసింది. మిర్చి, శనగ, పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇతర పంటలు వేసినవారి పరిస్థితీ అంతే. భూములు సాగు చేసుకున్నందుకు జిల్లావ్యాప్తంగా రూ.వెయ్యి కోట్ల వరకు కౌలు రూపంలో చేతులు మారుతుంది. అందులో సగం వరకు సాగు సీజన్‌కు ముందే భూయజమానులకు చేరుతుంది. అలాంటిది సీజన్‌ ప్రారంభమైనా కౌలు ఊసే లేదు. దీంతో భూయజమానులు అయోమయంలో ఉన్నారు. 

Updated Date - 2020-08-05T11:32:08+05:30 IST