Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైస్ కుక్కర్‌ను పెళ్లి చేసుకన్న వ్యక్తి ఫొటోలు వైరల్.. ఆ వెంటనే విడాకుల ప్రకటన.. చివరికి షాకింగ్ ట్విస్ట్!

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా టీనేజీ కుర్రాళ్లు.. ఐశ్వర్యారాయ్ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతారు. అదే.. 25-30ఏళ్ల మధ్య యువకులు  అయితే.. అందానికి అంత ప్రియారిటీ ఇవ్వరు. తమను అర్థం చేసుకుని.. కష్టసుఖాల్లో పాలుపంచుకునే అమ్మాయిని ఇల్లాలుగా చేసుకోవాలని ఆలోచిస్తారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. దానికి ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తే కారణం. ఆ వ్యక్తి చేసిన పనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ క్రమంలోనే అతడు మరో సంచలన విషయం ప్రకటించాడు. అది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. చివరికి అతడెవరో తెలిసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. 


ఇండోనేషియాకు చెందిన కహిరోల్ ఆనమ్ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నాడు. పని భారం తగ్గించుకునేందకు ఓ రైస్ కుక్కర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ముస్తాబు చేసిన రైస్ కుక్కర్‌కు ముద్దు పెడుతూ.. ఫొటోలు కూడా దిగాడు. సోషల్ మీడియా వేదికగా రైస్ కుక్కర్‌ను తన భార్యగా ప్రకటించేశాడు. దీంతో ఆనమ్ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో స్పందించిన కొద్దరు నెటిజన్లు.. ‘సాధారణంగా ఇతడి వయసు ఉన్న యువకులు ఎవరైనా.. తమ కష్టసుఖాల్లో పాలుపంచుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు కానీ ఈయనేంటి ఇలా రైస్ కుక్కర్‌ని పెళ్లి చేసుకున్నాడు’ అని ఆశ్చర్యపోతూ కామెంట్లు చేశారు. నెట్టింట ఈ చర్చ జరుగుతుండగానే.. ఆనమ్ మరో కీలక ప్రకటన చేశాడు. 


తన భార్య (రైస్ కుక్కర్)‌కు విడాకులు ఇచ్చినట్లు ప్రకటించేశాడు. తన భార్య అన్నం అయితే వండతుంది కానీ.. ఇతర ఆహారపదార్థలను మాత్రం చేయలేకపోతోందని ఆరోపించాడు. అందుకే డైవర్స్ ఇచ్చేసినట్ల సోషల్ మీడియాలో వివరించాడు. ఈ క్రమంలో.. ‘రైస్ కుక్కర్ పెళ్లి చేసుకోవడమే విచిత్రం అంటే.. మళ్లీ దానికి విడాకులు ఇవ్వడం ఏంట్రా బాబు’ అంటూ నెటిజన్లు కామెంట్లు వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే కొందరు నెటిజన్లు ఆనమ్‌ను గుర్తించారు. అంతేకాకుండా జనాల ముఖాల్లో నవ్వులు పుయించడం కోసం ఆనమ్.. తరచూ ఇలాంటి పనులే చేస్తారంటూ అసలు విషయాన్ని బయటపెట్టేశారు. దీంతో విషయం అర్థమై.. నెటిజన్లు నవ్వుకుంటున్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement