మున్సిపాలిటీలో ఉన్నతాధికారి తనిఖీ

ABN , First Publish Date - 2021-03-03T06:44:44+05:30 IST

నిర్మల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అవకతవకలకు పాల్పడుతున్నాడని కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ తఫీయోద్దీన్‌ ఉరఫ్‌ రఫూ చేసిన ఫిర్యాదు మేరకు సంబంధిత శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ తాహీద్‌ మసూద్‌ మంగళవారం ఇక్కడి కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.

మున్సిపాలిటీలో ఉన్నతాధికారి తనిఖీ
నిర్మల్‌ మున్సిపల్‌ అక్రమాలపై విచారణ జరుపుతున్న రీజనల్‌ డైరెక్టర్‌ తాహీద్‌మసూద్‌

ఫిర్యాదుల ఆధారంగా రికార్డుల పరిశీలన 

నిర్మల్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి)  : నిర్మల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అవకతవకలకు పాల్పడుతున్నాడని కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ తఫీయోద్దీన్‌ ఉరఫ్‌ రఫూ చేసిన ఫిర్యాదు మేరకు సంబంధిత శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ తాహీద్‌ మసూద్‌ మంగళవారం ఇక్కడి కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌తో పాటు మరో అధికారి మున్సిపల్‌ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించడమే కాకుండా ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ జరిపారు. కమిషనర్‌ వ్యవహారశైలిపై ఆరా తీశారు. ఇందిరమ్మ కాంప్లెక్స్‌లోని దుకాణాల కేటాయింపుపై ఆయన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం కేటాయింపులు జరిగాయన్న విషయంపై ఆర్‌ డీ కమిషనర్‌ బాలకృష్ణను ప్రశ్నించారు. దాదాపు గంట పాటు ఆర్‌డీ ఈ తనిఖీలు జరిపారు. విచారణ అంశాలను ఉన్నతాధికారులకు నివేదిస్తానని ఆయ న తెలిపారు. రీజనల్‌ డైరెక్టర్‌ జరిపిన విచారణలో కమిషనర్‌ అక్రమాలపై ఫిర్యాదు చేసిన కౌన్సిలర్‌ తఫీయోద్దిన్‌ ఉరఫ్‌ రఫూలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-03T06:44:44+05:30 IST