తొలగని ఇబ్బందులు

ABN , First Publish Date - 2022-07-28T06:25:28+05:30 IST

మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు నామవరం పెద్ద చెరువు అలుగు పోస్తుంది. నామవరం నుంచి గుంజలూరు వెళ్లే రోడ్డులో వరద నీరు సాఫీగా వెళ్లడానికి నెల రోజుల క్రితమే సిమెంట్‌ గూనలు వేశారు.

తొలగని ఇబ్బందులు
మోతె మండలం నామవరం నుంచి గుంజలూరు వెళ్లే రోడ్డుకు వరద పెరగడంతో రోడ్డు ధ్వంసమై వరదలో చిక్కుకున్న కూలీలు

మోతె, జూలై 27: మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు  నామవరం పెద్ద చెరువు అలుగు పోస్తుంది. నామవరం నుంచి గుంజలూరు వెళ్లే రోడ్డులో వరద నీరు సాఫీగా వెళ్లడానికి నెల రోజుల క్రితమే  సిమెంట్‌ గూనలు వేశారు. అయితే పనులను  అడ్డదిడ్డంగా చేసినందున  రోడ్డుకు వరద పెరిగి సుమారు రెండు కిలోమీటర్ల మేర  తట్టింది. వరద తాకిడికి రోడ్డు ధ్వంసమై  రెండు అడుగుల మేర ఉధృతంగా వెళుతోంది. దీంతో నామవరం పెద్ద చెరువు కింద ఉన్న పొలాల నుంచి మాధవరం చెరువు వరకు నాట్లుకు సిద్ధమైన వరి మడుల, పొలాలు ముని గాయి. రోడ్డు ధ్వంసం కావ డంతో వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు తాడు సాయంతో వరద నీటి నుంచి బయటికి వచ్చారు. కూడలి చెక్‌డ్యామ్‌ వరదలో కొట్టుకుపోవడంతో సిమెంట్‌, కంకర తేలింది. ఈ ప్రాంతంలో వరద తీవ్రతను తగ్గించడానికి అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలేదని రైతులు తెలిపారు. 

పొంగి ప్రవహిస్తున్న గురప్పవాగు

మునగాల రూరల్‌: ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలోని తాడ్వాయి గురప్ప వాగు  పొంగిపొర్లుతూ ప్రమాద కరంగా మారింది. దీంతో గణపవరం రోడ్డులో వంతెన మీదుగా నీరు ప్రవహిస్తున్నందున రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి వెంట మునగాల నుంచి వెల్దండ మీదుగా కీతవారిగూడెం వరకు 16కిలోమీటర్ల పరిధిలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. వారందరూ నిత్యం హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, గరిడే పల్లి, కోదాడకు వెళ్తుంటారు. నిత్యం వాహనాల రద్దీ ఉండే ఈ రోడ్డు గుంతల మయం కావడంతో వాహనదా రులు, చుట్టుపక్కల ప్రజలు ఎన్నో ఇబ్బందు లకు గురవుతున్నారు. ఈ రహదారిని డబుల్‌ లైన్‌గా మార్చి ఇబ్బందులను తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కాగా గురప్పవాగును తహసీల్దార్‌ కృష్ణ నాయక్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ రాధారెడ్డి, గ్రామ కార్యదర్శి సతీష్‌ పరిశీలించారు.  ఆత్మకూరు(ఎస్‌) మండలం నశీంపేట వాగు నీటిలో స్కూల్‌ బస్సు చిక్కుకోవడంతో స్థానికులు కాపాడారు. 










Updated Date - 2022-07-28T06:25:28+05:30 IST