చెక్కుచెదరని టవర్‌!

ABN , First Publish Date - 2020-09-14T05:31:21+05:30 IST

చెక్కుచెదరని టవర్‌!

చెక్కుచెదరని టవర్‌!

వందేళ్ల క్రితం నిర్మించిన పద్నాలుగు అంతస్థుల టవర్‌ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. లండన్‌లోని స్వే అనే గ్రామంలో ఉన్న ఈ టవర్‌ నిర్మాణం వెనకఅనేక విశేషాలున్నాయి.

ఆండ్రూ థామస్‌ అనే వ్యక్తి ఈ టవర్‌ నిర్మించాడు. 1879లో మొదలెట్టి 1985లో పూర్తిచేశారు. ఈ కట్టడానికి 40 మంది కూలీలు ఆరేళ్లపాటు శ్రమించారు.  

ఈ టవర్‌ 216 అడుగుల ఎత్తు, 18 అడుగుల వ్యాసార్థంతో ఉంటుంది. ఈ టవర్‌ ప్రత్యేకత ఏమిటంటే దీని నిర్మాణంలో స్టీల్‌ ఉపయోగించలేదు. స్టీల్‌ వాడకుండా నిర్మించిన అతి ఎత్తైన నిర్మాణంగా ఈ టవర్‌ గుర్తింపు పొందింది.

నిర్మాణం పూర్తయ్యాక చాలా ఏళ్ల వరకు నిరుపయోగంగానే ఉంది. 45 ఏళ్ల క్రితం దీన్ని నివాస గృహంగా మార్చారు.

టవర్‌ పై భాగం విశాలంగా ఉంటుంది. వస్తువులన్నీ అమర్చుకోవడానికి కావలసినంత స్థలం ఉంటుంది.

Updated Date - 2020-09-14T05:31:21+05:30 IST