కరోనా కష్టకాలంలో ఉగ్రదాడులకు ఐఎస్ వ్యూహం

ABN , First Publish Date - 2020-03-29T18:35:18+05:30 IST

కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత విపత్కర పరిస్థితుల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఉగ్రదాడులకు వ్యూహం పన్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ....

కరోనా కష్టకాలంలో ఉగ్రదాడులకు ఐఎస్ వ్యూహం

ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరిక 

న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత విపత్కర పరిస్థితుల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఉగ్రదాడులకు వ్యూహం పన్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆదివారం హెచ్చరికలు జారీ చేశాయి. జమ్మూకశ్మీర్ లోని షోపియాన్ ప్రాంతంలోని రహస్య శిబిరంలో దాక్కున్నఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులు కశ్మీర్ లోయ నుంచి ఢిల్లీకి మకాం మార్చారని వెల్లడైంది. వారు టెలిగ్రాం ద్వారా రహస్య మంతనాలు సాగించారని తేలింది. కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీతోపాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో సాయుధ పోలీసు పహరాను పెంచాలని ఇంటెలిజెన్స్ సూచించింది. కరోనాతో తల్లడిల్లుతున్న ప్రస్థుత తరుణంలో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు వ్యూహం పన్నినందున హైఅలర్ట్ ప్రకటించి సాయుధ పహరా పెంచాలని ఇంటెలిజెన్స్ కోరింది. 

Updated Date - 2020-03-29T18:35:18+05:30 IST