మతం మారితే కులాంతర వివాహ సర్టిఫికెట్‌ నో

ABN , First Publish Date - 2021-11-26T09:03:22+05:30 IST

మతం మారిన వారు కులాంతర వివాహ సర్టిఫికెట్లు పొందేందుకు అనర్హులని మద్రాసు హైకోర్టు తేల్చి చెప్పింది.

మతం మారితే కులాంతర వివాహ సర్టిఫికెట్‌ నో

చెన్నై, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): మతం మారిన వారు కులాంతర వివాహ సర్టిఫికెట్లు పొందేందుకు అనర్హులని మద్రాసు హైకోర్టు తేల్చి చెప్పింది. అలా సర్టిఫికెట్లు జారీ చేస్తే అవి దుర్వినియోగమయ్యే అవకాశముందని స్పష్టం చేసింది. సేలం జిల్లా మేట్టూరు వాసి.. క్రైస్తవ ఆదిద్రావిడ వర్గానికి చెందిన పాల్‌రాజ్‌ గతంలో బీసీ సర్టిఫికెట్‌ పొందారు. అయితే, తాను అరుంధతీయ వర్గానికి చెందిన అముద యువతిని వివాహం చేసుకున్నందున తనకు కులాంతర వివాహ సర్టిఫికెట్‌ ఇవ్వాలంటూ తహసీల్దార్‌ వద్ద దరఖాస్తు చేసుకోగా ఆయన తిరస్కరించారు. దీనిపై పాల్‌రాజ్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. 

Updated Date - 2021-11-26T09:03:22+05:30 IST