ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-10-22T06:08:22+05:30 IST

ఇంటర్‌ పరీక్షలు పకడ్బందిగా నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.

ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ తదితరులు

- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి 

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు 21 : ఇంటర్‌ పరీక్షలు పకడ్బందిగా నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై గురువారం ఆమె అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇంటర్‌ పరీక్షలను ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిం చడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 25 నుంచి నవంబర్‌ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు సిద్ధంగా ఉండాలన్నారు. పరీక్షలు నిర్వహించే కేంద్రాలను శుభ్రం చేయించాలని, ప్రతి ఒక్క రూ కరోనా నిబంధనలను పాటించాలన్నారు. కరోనా తరువాత మొదటిసారిగా పరీ క్షలు నిర్వహిస్తున్నందున కొవిడ్‌ ప్రొటోకాల్‌ పాటిస్తూ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా కలెక్టర్‌లకు సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఫర్నీచర్‌ ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతిరోజు శానిటైజ్‌ చేయాలని, మాస్కులు, శానిటైజర్లు, ఽథర్మల్‌ స్ర్కీనింగ్‌, ప్రథమ చికిత్సకు వైద్యులు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని, జ్వరం లక్షణాలున్న వారికి ప్రత్యేక గది కేటాయించాలని వైద్య అధికారులకు మంత్రి సూచించారు. విద్యార్థులు, ఇతర సిబ్బంది, తప్పనిసరిగా మాస్కులు ఉండాలని, పరీ క్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ ఉండే జిరాక్స్‌ సెంటర్‌లు పరీక్ష జరిగే సమయంలో మూసి ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. కాగా, వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారా యణ మాట్లాడుతూ జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరీక్షలు సజా వుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులతో సన్నాహక సమన్వయ సమా వేశం ఏర్పాటు చేసి తగిర ఆదేశాలిచ్చామని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునే విధంగా ఆర్టీసీ ప్రత్యేకబస్సులు నడుపుతామని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌అధికారి కల్పన తదితరులు వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T06:08:22+05:30 IST