ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

ABN , First Publish Date - 2020-12-04T05:42:42+05:30 IST

ఉట్నూర్‌ కుమ్రం భీం ప్రాంగణంలోని ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న వికాసం ప్రత్యేక పాఠశాలలో గురువారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా సీఆర్టీల సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం నిర్వహించామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోడాం శ్రీనివాస్‌ తెలిపారు.

ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నినాదాలు చేస్తున్న సంఘం సభ్యులు

ఉట్నూర్‌రూరల్‌, డిసెంబరు 3: ఉట్నూర్‌ కుమ్రం భీం ప్రాంగణంలోని ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న వికాసం ప్రత్యేక పాఠశాలలో గురువారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా సీఆర్టీల సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం నిర్వహించామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోడాం శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవరాలు కల్గిన విద్యార్థితో కలిసి  కేక్‌ను కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యు. రమేష్‌, ప్రధాన కార్యదర్శి వంశీ, రాష్ట్ర నాయకులు ఇందల్‌సింగ్‌, సురేష్‌, బీమేష్‌, రాంచందర్‌, లాల్‌సింగ్‌, తిరుపతితో పాటు వికాసం పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

వికలాంగుల హక్కులకు రక్షణ కల్పించాలి..

ఆదిలాబాద్‌టౌన్‌: వికలాంగులకు ప్రత్యేక హక్కులు, చట్టాలు ఉన్న అవి రక్షణ కరువై నిర్వీర్యమవుతునందుకు ప్రభుత్వం, అధికారులు రక్షణ కల్పించాలని వికలాంగుల సంక్షేమ సంఘం సభ్యులు పేర్కొన్నారు. గురు వారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించేలా చూడాలని కోరారు. ఈ మేరకు అంబేద్కర్‌చౌక్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ వికలాంగులకు యేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం, అధికారులు రావాల్సిన ప్రయోజనాలను సక్రమంగా కల్పించడం లేదన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి మాకు న్యాయం చేయాలని కోరారు. 

దివ్యాంగులకు హక్కులు కల్పించాలి..

దివ్యాంగుల పట్ల జాలి దయ చూపకుండా హక్కులు కల్పించేలా ప్రభుత్వాలు, ఇతర సంస్థలు ప్రయత్నించాలని పాయల్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ పాయల్‌ శరత్‌ అన్నారు. గురువారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాయల శరత్‌ మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల సాధనకు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలన్నారు. 30 శాతం వికలాంగత్వం ఉన్న పెన్షన్‌, డ్రైవింగ్‌ లైసెన్సులు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వాలు, పాలకులు వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల ప్రవీణ్‌, దోనిజ్యోతి, దివ్యాంగుల సంఘం నాయకులు బావునే నగేష్‌ తదితరులున్నారు.

Updated Date - 2020-12-04T05:42:42+05:30 IST