విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-24T12:50:11+05:30 IST

విదేశాల నుంచి వచ్చిన విమాన ప్రయాణికులు కొవిడ్ నెగిటివ్ రిపోర్టు ఇవ్వకుంటే వారికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించడంతోపాటు వారిని హోం ఐసోలేషన్‌కు తరలిస్తామని....

విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు

హోం ఐసోలేషన్ కు తరలిస్తాం...

చండీఘడ్ (పంజాబ్): విదేశాల నుంచి వచ్చిన విమాన ప్రయాణికులు కొవిడ్ నెగిటివ్ రిపోర్టు ఇవ్వకుంటే వారికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించడంతోపాటు వారిని హోం ఐసోలేషన్‌కు తరలిస్తామని పంజాబ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్దూ చెప్పారు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో నెగిటివ్ అని తేలితే వారిని హోం క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తామని మంత్రి చెప్పారు. కొవిడ్ సోకిన వారి ఆరోగ్యపరిస్థితిని వైద్యులు 7 రోజుల పాటు పర్యవేక్షిస్తారని మంత్రి చెప్పారు. కరోనా పాజిటివ్ అని వచ్చిన విదేశీ ప్రయాణికులను ప్రైవేటు ఐసోలేషన్ కేంద్రాల్లో డబ్బు చెల్లింపుపై ఉంచుతామని మంత్రి పేర్కొన్నారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు తమ ఆరోగ్య పరిస్థితిపై సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని మంత్రి సూచించారు.కరోనాను నివారించేందుకు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని మంత్రి సిద్ధూ సూచించారు. 

Updated Date - 2020-09-24T12:50:11+05:30 IST