Abn logo
May 25 2020 @ 21:37PM

నీరవ్ మోదీ సోదరుడిపై మళ్లీ రెడ్ కార్నర్ నోటీసులు

న్యూఢిల్లీ: పీఎన్‌బీ కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీపై ఇంటర్‌పోల్ మరోసారి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. తనపై గతేడాది జారీ అయిన రెడ్ కార్నర్ నోటీసులను సవాల్ చేస్తూ నేహాల్ పెట్టుకున్న పిటిషన్‌ను ఇటీవల ఈ అంతర్జాతీయ పోలీసు సహకార సంస్థ కొట్టివేసింది. తాజాగా భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు మరోసారి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో నీరవ్ మోదీతో పాటు నేహాల్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కుంభకోణం వెలుగుచూడడానికి సరిగ్గా నెలరోజుల ముందే నీరవ్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు దేశం విడిచి పారిపోయారు. వీరంతా తలో దేశంలో పౌరత్వాలు కూడా పొందడంతో.. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ, ఈడీ సంస్థలు ఇంటర్‌పోల్ సాయం కోరాయి. 

Advertisement
Advertisement
Advertisement