సబ్జెక్ట్‌ కాంట్రాక్ట్‌ బోధనకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-11-23T05:25:03+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిషరీష్‌ సైన్స్‌, డెయిరీ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ కోర్సులను సబ్జెక్ట్‌ కాంట్రాక్ట్‌ పద్ధతిలో బోధనకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వర్సిటీ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పి.సుజాత తెలిపారు.

సబ్జెక్ట్‌ కాంట్రాక్ట్‌ బోధనకు  దరఖాస్తుల ఆహ్వానం

ఎచ్చెర్ల : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిషరీష్‌ సైన్స్‌, డెయిరీ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ కోర్సులను సబ్జెక్ట్‌ కాంట్రాక్ట్‌ పద్ధతిలో బోధనకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వర్సిటీ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పి.సుజాత తెలిపారు. ఫిషరీస్‌ సైన్స్‌ బోధించేందుకు ఎమ్మెస్సీ మెరైన్‌ బయాలజీ, మెరైన్‌ బయోటెక్నాలజీ, మెరైన్‌ బయాలజీ అండ్‌ ఫిషరీస్‌, కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ మెరైన్‌ బయాటెక్నాలజీ ఫిషరీస్‌, ఇండ స్ర్టీయల్‌ ఫిషరీస్‌, జువాలజీ (ఫిషరీస్‌) పూర్తిచేసినవారు దరఖాస్తు చేయాలన్నారు. డెయిరీ అండ్‌ యానిమల్‌ హ జ్బెండరీ సబ్జెక్ట్‌ బోధనకు ఎమ్మెస్సీ యానిమల్‌ హజ్బెండరీ, డెయిరీ టెక్నాలజీ, బీవీఎస్సీ అర్హత ఉండాలన్నారు. ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ బోధనకు ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ బోధనకు ఎమ్మెస్సీ బయోటెక్నాల జీ, ఎమ్మెస్సీ అనలెటికల్‌ కెమిస్ట్రీ బోధనకు ఎమ్మెస్సీ అనలెటికల్‌ కెమిస్ట్రీ అభ్యర్థులు అర్హులని తెలిపారు. నెట్‌, స్లెట్‌ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ నెల 28 లోగా వర్సిటీలోని సైన్స్‌ కళాశాల కార్యాలయానికి నేరుగా లేదా పోస్టల్‌ ద్వారా దరఖాస్తులు అందజేయాలన్నారు.

Updated Date - 2020-11-23T05:25:03+05:30 IST