గాడి తప్పుతున్న పాలన..

ABN , First Publish Date - 2020-05-30T10:47:01+05:30 IST

మొదటి గ్రేడ్‌ మున్సిపా లిటీగా పేరున్న జగిత్యాల బల్దియాలో పాలన గాడి తప్పుతుందనే విమర్శలు

గాడి తప్పుతున్న పాలన..

జగిత్యాల బల్దియాలో అక్రమాల హవా

శానిటేషన్‌ విభాగంలో ఉద్యోగాల లొల్లి 

తాత్కాలిక ఉద్యోగుల వేతనాల రికవరీకి చర్యలు?

ఎస్టిమేషన్‌, కోటేషన్‌ లేకుండానే జేసీబీ, ట్రాక్టర్ల కోనుగోలుకు నేరుగా ఒప్పందం


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: మొదటి గ్రేడ్‌ మున్సిపా లిటీగా పేరున్న జగిత్యాల బల్దియాలో పాలన గాడి తప్పుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. శానిటేష న్‌ విభాగంలో కొన్ని రోజులుగా ఉద్యోగాల లోల్లి న డుస్తుండగా, ట్రాక్టర్లు, జేసీబీ కొనుగోలులో అక్రమా లు చోటుచేసుకున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. దీనికి తోడు ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్దం గా అందులో పని చేసే తాత్కాలిక ఉద్యోగులకు జీ తాలు ఎక్కువ చెల్లించి ఆడిట్‌ అధికారులకు అడ్డంగా దొరిపోగా, ఇప్పుడు రికవరీ కోసం నానా తంటాలు పడుతున్నారు. ఇలా జగిత్యాల బల్దియాలో పాలక వర్గం పట్టింపులేనట్టుగా వ్యవహరిస్తుండడంతో అధి కారులు, ఉద్యోగులు అక్రమాలకు తెరలేపారనే ఆరో పణలు వినిపిస్తున్నాయి.  


పట్టణ ప్రగతితో కొత్త ఉద్యోగాలకు తెర..

ప్రభుత్వం పల్లె ప్రగతి తరహాలో పట్టణ ప్రగతి కార్యాక్రమాన్ని ఇటీవల అమలు చేసింది. 10 రోజుల పాటు జగిత్యాల బల్దియాలోని 48 వార్డుల్లో పారిశు ధ్యం మెరుగు పరిచేలా చర్యలు చేపట్టింది. 40 మం ది రెగ్యూలర్‌, 221 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో పా టు మరో 50 మందికి పైగా తాత్కాలిక ఉద్యోగుల తో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ముగించారు. అ యితే ఇప్పుడు శానిటేషన్‌ విభాగంలో కొత్త ఉద్యోగా ల లోల్లి తెరపైకి వచ్చింది. జగిత్యాల బల్దియా గతం లో 38 వార్డులు ఉండగా ఇటీవల శంకులపల్లి, గో వింద్‌పల్లి, తారక రామనగర్‌, లింగంపేట గ్రామాలు జగిత్యాల పట్టణంలో వీలీనం అయ్యాయి. ఈ గ్రామ పంచాయీతీల్లో కేవలం ఒకరు, ఇద్దరు మాత్రమే పా రిశుధ్య విభాగంలో పనిచేస్తున్నారు.


కొత్త గ్రామాలు వీలీనం కావడంతో కొత్త ఉద్యోగాల కోసం పలువు రు నిరుద్యోగులు బల్దియా అధికారుల చూట్టూ తిరు గుతూ శానిటేశన్‌ విభాగంలో ఉధ్యోగాలను దక్కిం చుకునేందుకు లక్షల్లో ముడుపులు చెల్లించారనే వాద నలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పెగడపెల్లి మం డలానికి చెందిన ఓ శానిటేషన్‌ తాత్కాలిక ఉద్యోగి శానిటేషన్‌ విభాగం అధికారులను తన ఉద్యోగం కో సం ఇచ్చిన డబ్బుల విషయంలో ఏకంగా కార్యాల యానికి వచ్చి నీలదీసిన ఘటన చర్చానీయంశంగా మారింది. ఆ వ్యక్తికి తక్షణమే విధుల్లోకి తీసుకుం టామని సంబంధిత శాఖ అధికారి ఏకంగా లేటర్‌ కూడా ఇవ్వడం చూస్తుంటే అధికారులు తమ తప్పి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అడ్డదారులు తొక్కుతు న్నారని తెలుస్తోంది. అంతే కాకుండా 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఓ తాత్కాలిక ఉద్యోగి కొంత కాలంగా అనారోగ్యానికి గురి కాగా మళ్లీ విధుల్లోకి తీసుకునేం దుకు జవాన్లతోపాటు, శానిటరి ఇన్స్‌పెక్టర్‌ పేచీ పె డుతున్నారనే వాదనలు ఉన్నాయి. 


ఆగ్రోస్‌ ద్వారా నేరుగా జేసీబీ, ట్రాక్టర్లు..

శానిటేషన్‌ విభాగాన్ని పటిష్టం చేసేందుకు 2018 -19 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేకాధికారి పాలనలో 14వ, ఆర్థిక సంఘం నిధుల ద్వారా జేసీబీ, ఆరు ట్రా క్టర్లను కొనుగొలు చేసేందుకు పరిపాలనా అనుమ తిని పొందారు. ప్రస్తుత సమయంలో అధికారులు జేసీబీ, ట్రాక్టర్లను కొనుగోలు చేసేందుకు ఎలాంటి ఎస్టిమేట్‌, టెక్నికల్‌ సాంక్షన్‌, కోటేషన్‌, అగ్రిమెంట్‌, టెండర్‌ వేయకుండానే రూ. 75.50 లక్షల విలువగల జేసీబీతో పాటు ఆరు ట్రాక్టర్లు నేరుగా ప్రభుత్వ రం గ సంస్థ అయిన ఆగ్రోస్‌తో ఒప్పందం కుదుర్చుకుని బిల్లును చేల్లించేందుకు ఫైల్‌ను చక చకా ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిసింది. ఇందులో కొందరు ఉ ద్యోగులు కమీషన్‌ దండుకునేందుకు ప్రయత్నిస్తు న్నట్లు సమాచారం. గతంలో అనేకమార్లు బల్దియా అధికారులు వాహనాలు కొనుగోలు చేయగా కౌన్సిల్‌ తీర్మాణం చేసి, టెండర్ల ద్వారా వాహనాలను కొనుగో లు చేశారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా వాహ నాలు కొనుగోలు చేయడం అనుమానాలకు తావి స్తోంది. 


తాత్కాలిక ఉద్యోగుల వేతనాల రికవరికి చర్యలు?

జగిత్యాల బల్దియాలో శానిటేషన్‌, రెవెన్యూ, ఇం జనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్లు ఉన్నాయి. ఆయా విభాగాల్లో 75 శాతం మంది తాత్కాలిక ఉద్యోగులే విధులు నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్‌,  రెవిన్యూ వి భాగంలో పనిచేస్తున్న కొంత మంది తాత్కాలిక ఉ ద్యోగులు ఉన్నతాధికారులు అండదండలతో గత సం వత్సరం జనరల్‌ ఫండ్‌ నుంచిజీవోకు మించి వేత నాలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీనిని ఆల స్యంగా గుర్తించిన ఆడిట్‌ అధికారులు వేతనాల రిక వరికీ ఆదేశాలు జారీచేయండంతో పాటు, వేతనాల ను తగ్గించి జీవో ప్రకారం చెల్లించే విధంగా మార్పు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.


జీవో ప్రకారం బి ల్లులు చెల్లించాల్సిన అధికారులు కమీషన్లకు అలవా టు పడ్డారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా కార్యాలయంలోని వివిధ శాఖల్లో అనువ జ్ఞులైన సిబ్బందిని తప్పించి కొత్త పాలక వర్గానికి అ నుకూలంగా ఉన్న సిబ్బంది శాఖల మార్పులు, చే ర్పులు చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై ఇంజనీ రింగ్‌ శాఖ డీఈ లచ్చిరెడ్డిని వివరణ కోరగా ఇంజనీ రింగ్‌ అధికారులకు ఎక్కువ వేతనం తీసుకునే అవ కాశం ఉందనీ ఆ ప్రకారమే ఇచ్చామని, ఆగ్రోస్‌ ప్ర భుత్వ రంగ సంస్థ కావడంతో నేరుగా కొనుగోలు చేశామని అన్నారు.


Updated Date - 2020-05-30T10:47:01+05:30 IST