విలీన పంచాయతీల్లో అక్రమాలు

ABN , First Publish Date - 2021-02-24T04:32:45+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మున్సిపాలిటీలో విలీనమై న పంచాయతీలలో జరిగిన అనుమతుల దందా బయటపడుతోంది.

విలీన పంచాయతీల్లో అక్రమాలు
జాతీయ రహదారిని అనుకుని కాంప్లెక్స్‌ నిర్మాణానికి తీసిన గుంతలు

అడ్డగోలుగా అనుమతులు 

జాతీయ రహదారి పరిధిలో.. ప్రభుత్వ భూమిలో సైతం దర్జాగా దందా

ఆర్మూర్‌, ఫిబ్రవరి 23: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మున్సిపాలిటీలో విలీనమై న పంచాయతీలలో జరిగిన అనుమతుల దందా బయటపడుతోంది. మున్సిపాలిటీలో విలీనమవుతుందనే ఉద్దేశంతో అప్పటి పాలకవర్గాలు ఇష్టానుసారంగా ఇళ్ల నిర్మాణానికి అ నుమతిలిచ్చాయి. ఆర్మూర్‌ మున్సిపాలిటీలో పెర్కిట్‌, మా మిడిపల్లి గ్రామ పంచాయతీలు రెండేళ్ల క్రితం విలీనమ య్యాయి. విలీనమయ్యే ముందు ఇళ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. కొంత మంది ఇళ్లు నిర్మి ంచుకోడానికి దరఖాస్తు చేస్తే, మరికొంత మంది మున్సిపా లిటీలో విలీనమైన తర్వాత అనుమతి తీసుకోవడం కష్టమ వుతుందని, పెద్ద మొత్తంలో లంచాలు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో అనుమతి తీసిపెట్టుకున్నారు. అప్పటి పాలకవ ర్గాలు తాము కూడా పదవి నుంచి దిగిపోతున్నామనే ఉద్దే శంతో పెద్ద మొత్తంలో మామూళ్లు తీసుకుని అనుమతిని చ్చాయి. దీనికి పంచాయతీ అధికారులు సైతం సహకరిం చారు. ప్రస్తుతం అక్రమ అనుమతుల వ్యవహారాలు బయ టపడుతున్నాయి. ఇప్పటికే పెర్కిట్‌ దారిలో సిరి ఆసుపత్రి పక్కన అసైన్డ్‌మెంట్‌ భూమిలో కాంప్లెక్స్‌ నిర్మాణం చేప ట్టారు గ్రామపంచాయతీ అనుమతి ఉందనే ఉద్దేశంతో కాం ప్లెక్స్‌ పనులు ప్రారంభించారు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళ న జరగడంతో మున్సిపల్‌ అధికారులు పనులు నిలిపివేశా రు. తాజాగా జాతీయరహదారిపై అక్రమంగా అనుమతిని చ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. పెర్కిట్‌ గ్రామపంచా యతీ పరిధిలో గంగ టవర్స్‌ పక్కన జాతీయరహదారి పరి ధిలో షాపింగ్‌ కాంప్లెక్స్‌కు అనుమతినిచ్చారు. జాతీయరహ దారికి ఇరువైపులా వంద అడుగులు  ఉండాలి. ఈ పరిధి లో అనుమతినిచ్చే వీలులేదు. 100అడుగుల తర్వాత లే అ వుట్‌ ప్లాట్లు ఉన్నాయి. లే అవుట్‌ ప్లాట్ల ముందు జాతీయర హదారికి వదిలేసిన స్థలంలో అనుమతినిచ్చారు. 2019 ఫి బ్రవరి 27న ఏలేటి నర్సారెడ్డి అనే వ్యక్తికి షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి పెర్కిట్‌ గ్రామపంచాయతీ నుంచి అనుమతిని చ్చారు. గ్రామపంచాయతీ మున్సిపాలిటీలో విలీనమయ్యే ముందు అనుమతినిచ్చారు. అనుమతి గడువు ఈనెల 26 తో ముగియనుంది. అనుమతి తీసుకున్న వారు రెండేళ్లుగా పనులు ప్రారంభించకుండా గడువు ముగుస్తుందనే ఉద్దేశం తో నాలుగైదు రోజుల క్రితం పనులు ప్రారంభించారు. నిబ ంధనల ప్రకారం పనులు రెండేళ్లలో పూర్తి చేయాలి. పను లు పూర్తి కాకుంటే రెన్యూవల్‌ చేసుకోవాలి. రెన్యూవల్‌ చే సుకోకుండానే పనులు చేస్తున్నారు.

డీటీపీసీ అనుమతి ఉన్నప్పటికీ..

జాతీయ రహదారి పక్కన సర్వే నెంబర్‌ 16, 21/1, 22/2 సర్వే నెంబర్‌లో డీటీసీపీ అనుమతితో లే అవుట్‌ చే శారు. అందులో 200అడుగుల రహదారిగా చూయించారు. డీటీసీపీలో 200అడుగుల రహదారి చూయించిన తర్వాత లే అవుట్‌కు జాతీయురహదారికి మధ్యలో నిర్మాణాలకు అ నుమతి ఇవ్వరాదు. కానీ పంచాయతీ పాలకవర్గం, అధికా రులు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారు. పెర్కిట్‌, మామి డిపల్లి గ్రామాల్లో చాలా చోట్ల అక్రమాలు జరుగుతున్నాయి. 

ఐసీడీఎస్‌ దారిలో అక్రమంగా షెడ్డు నిర్మాణం 

ఐసీడీఎస్‌, పాత నిమ్మల గార్డెన్‌ దారిలో కూడా కెనాల్‌ భూమిలో అక్రమంగా షెడ్డు నిర్మిస్తున్నారు. తమ భూమిలో షెడ్డు నిర్మిస్తున్నారని సంబంధిత అధికారులు మున్సిపల్‌, రెవెన్యూ అధికారులకు నెల రోజుల క్రితం ఫిర్యాదు చేయ గా చాలా ఆలస్యంగా స్పందించి పనులు బంద్‌ చేయించా రు. ఈ రెండు చోట్ల ఒక కౌన్సిలర్‌ అండదండలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ డెయిరీ ఫారమ్‌ అని బోర్డు పెట్టినప్పటికీ ఇందులో బార్‌ ర్పాటు చేస్తున్నారని తె లిసింది.

పనులు నిలిపివేశాం : కమిషనర్‌

ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ శైలజను వివరణ కోరగా రెండు చోట్ల పనులు నిలిపివేశామని తెలిపారు. గం గా టవర్స్‌ పక్కన జాతీయ రహదారిపై గ్రామపంచాయతీ ఇచ్చిన పర్మిషన్‌ 26తో ముగుస్తుందని, కొత్తగా రెన్యూవల్‌ చేసుకోవాలన్నారు. జాతీయరహదారుల అధికారుల మార్కి ంగ్‌, ఇరిగేషన్‌ అధికారుల ఎన్‌ఓసీ ఉంటేనే రెన్యూవల్‌ చే స్తామన్నారు. పాత నిమ్మల గార్డెన్‌ దారిలో షెడ్డు నిర్మాణా నికి డీడీఎంఎస్‌లో దరఖాస్తు చేసుకున్నామని, టీఎస్‌ బీ పాస్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించామన్నారు. ఇరి గేషన్‌ ఇంజనీర్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌, మున్సిపల్‌ ఇం జనీర్‌ తనిఖీ చేసి క్లియరెన్స్‌ ఇస్తేనే అనుమతి లభిస్తుందని తెలిపారు.

Updated Date - 2021-02-24T04:32:45+05:30 IST