Abn logo
Apr 18 2021 @ 22:36PM

చెక్‌ డ్యాంల నిర్మాణంతోనే సాగునీరు

బిచ్కుంద, ఏప్రిల్‌ 18: చెక్‌డ్యాంల నిర్మాణాలతో నీటి నిల్వ వల్ల పంటలకు సాగు నీరు అందుతుందని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. ఆదివారం మండలంలోని గుండెనెమలి, పుల్కల్‌, పెద్దదేవాడ గ్రామాల్లో చెక్‌డ్యాంల నిర్మాణాలకు హన్మంత్‌షిండే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజీరాలో ప్రవహించే నీరు వృథాగా వెళ్లే వాటిని చెక్‌డ్యాం నిర్మాణంతో రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో మండలంలో బీడు భూములన్నీ సాగులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్‌ పటేల్‌, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్‌, మాజీ ఏంఎసీ చైర్మన్‌ రాజు, ఎంపీటీసీలు సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement