తోడేస్తున్నారు..

ABN , First Publish Date - 2021-06-20T06:04:51+05:30 IST

అక్రమ సంపాదనే ధ్యేయంగా జిల్లాలో జోరుగా ఇసుక దందా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో గల వాగులు, గోదావరిలో యథేచ్చగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నా.. అ ధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తోడేస్తున్నారు..
ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న దృశ్యం

 జగిత్యాల జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా

- చెక్‌డ్యాంలు, అభివృద్ధి పేరిట దందా

- అడ్డగోలు ధరలకు మార్కెట్‌లో విక్రయం

- ప్రభుత్వ ఆదాయానికి గండి

- పట్టించుకోని రెవెన్యూ, పోలీస్‌, మైనింగ్‌ శాఖ అధికారులు

జగిత్యాల, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): అక్రమ సంపాదనే ధ్యేయంగా  జిల్లాలో జోరుగా ఇసుక దందా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో గల వాగులు, గోదావరిలో యథేచ్చగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నా.. అ ధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రధానంగా గోదావరి ప్రాంతాలైన మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, మెట్‌ పల్లి, రాయికల్‌, ధర్మపురి తదితర మండలాల నుంచి నిత్యం వందల ట్రాక్టర్ల సంఖ్యలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అధికారులు అటు వై పు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల అండదం డలు, రాజకీయ నాయకుల ప్రోద్భలంతో ఇసుక మాఫీయాల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. అంతా తెలిసి నా జిల్లా రెవెన్యూ, అధికారులు,పోలీసులు నామమాత్రంగా తనిఖీలు చే స్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అభివృద్ధి పేరిట అక్రమ దందా..

జగిత్యాల జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పథకాల పేరుతో ఇ సుకను అక్రమంగా రవాణా చేస్తూ ద్వితీయశ్రేణికి చెందిన అధికార పార్టీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగిత్యా ల జిల్లాలో కాల్వల నిర్మాణాలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, సీసీ రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాల పేరుతో ఇసుకను తరలిస్తూ బహిరంగా మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో ఇసుక అక్రమాలకు అడ్డు అ దుపులేకుండాపోతుంది.

నిఘా లోపం అక్రమార్కులకు వరం..

జిల్లాలో జరుగుతున్న అక్రమ రవాణాపై పోలీసులు, రెవెన్యూ, మైనిం గ్‌, విజిలెన్స్‌ తదితర విభాగాల అధికారుల నిఘా వైపల్యం, కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇష్టారాజ్యంగా ఇసుకను వాహనాల్లో తరలిస్తున్నా పట్టించు కోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొక్కుబడిగా ఇసుక వా హనాలు సీజ్‌ చేస్తూ వాహనాలను వదిలి పెడుతున్నారనే ఆరోపణలు వి నిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టవేస్తే గృహ నిర్మాణ దా రులకు అందుబాటు ధరలో ఇసుక లభ్యమయ్యే అవకాశాలున్నాయి. ప్ర భుత్వ ఆదాయం సైతం పెరుగుతుంది.

వానాకాలం ఇసుక... బంగారం..

జిల్లాలో ఇసుక కొరత నిర్మాణ రంగాన్ని కుదేలు చేస్తోంది...మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు అసలే కరోనా ప్రభావం వలన నిర్మాణ రంగ సామగ్రి ధరలు భారీగా పెరిగి సతమతమవుతుంటే ప్రస్తుత వ ర్షాకాలంలో ఇసుక ధరలు మరింత ప్రియం కానున్నాయి. జిల్లాలో ఇసుక కొరత తీర్చడానికి జిల్లా కేంద్రంలో ఒకే ఒక సబ్‌ స్టాక్‌ యార్డ్‌ తప్ప కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ వంటి మున్సిపాల్టీలతో పాటుగా మిగతా ప్రాంతాలలో ఎక్కడకూడా ఇసుక లభించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్దనున్న ఇసుక రీచ్‌లలో ఒక క్యూబిక్‌ మీటర్‌కు 600 రూపాయల చొప్పున ఇసుకను లా రీలలో నింపుతుండగా జగిత్యాల సబ్‌స్టాక్‌ యార్డ్‌లో మాత్రం ఒక క్యూబి క్‌ మీటర్‌కు 1800 రూపాయల వరకు ప్రభుత్వమే వసూలుచేస్తోందని గృహనిర్మాణదారులు వాపోతున్నారు. జగిత్యాల జిల్లాలో మల్లాపూర్‌, ఇబ్ర హీంపట్నం, మెట్‌పల్లి, రాయికల్‌, బీర్‌పూర్‌, ధర్మపురి మండలాల్లో ఇసుక లభ్యత ఉన్నప్పటికి అధికారులు దృష్టి సారించకపోవడంతో ఆయా ప్రాం తాల్లో ఇసుక మాఫియా వేలాది ట్రాక్టర్ల ఇసుకను నిల్వచేసి బహిరంగా మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. 

చెక్‌డ్యాంల పేరుతో ఇసుక పక్కదారి..

భూగర్బజలాలు పెరుగుదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జిల్లా లో కొన్ని వాగులపై చెక్‌డ్యాం నిర్మాణాలు చేపడితే, వీటి నిర్మాణం పేరు తో కొద్దిమంది నాయకులు, గుత్తేదారుల అవతారం ఎత్తి ప్రభుత్వం నుం చి ఇసుక అనుమతులు పొంది వాటిని బహిరంగా మార్కెట్‌లో పక్క దారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మొ త్తం వ్యవహారంలో దళారులతో పాటు, ప్రజా ప్రతినిధులు, జిల్లాలోని మండల స్థాయిలో కీలక నేతలు అన్ని తామై వ్యవహరిస్తున్నట్టు జిల్లా గృహనిర్మాణదారులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. 

అక్రమ వ్యాపారంతో ధరలకు రెక్కలు...

ధరల విషయంలో ఇసుక మాఫియా ఆడింది ఆట..పాడింది పాట అన్న చందంగా తయారైంది. ప్రాంతాలను బట్టి ఇసుక ధరలకు రెక్కలు వస్తున్నాయి. జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురి, రాయికల్‌ వంటి పట్టణాల్లో ఇసుక క్వాలిటీని బట్టి ధరలను నిర్ణయిస్తూ వ్యాపారులు సొ మ్ము చేసుకుంటున్నారు. ఒక్క ట్రాక్టర్‌కు రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు వినియోగదారుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. పేపర్‌ లోడుకు రూ. 6,500 రూపాయలు, బాడి లోడుకు రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. పల్లె ప్రాంతాలలో ఒక్కో ట్రాక్ట ర్‌కు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు వసూలు చేస్తున్నారు. జి ల్లాలోని పలు మండలాల్లో వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ప్రతినిత్యం ఇసుకను సరాఫరా చేస్తున్నట్లు అంచనాలున్నాయి. నిత్యం రూ. లక్షల్లో అ క్రమ ఇసుక వ్యాపారం జరుగుతోంది. ప్రభుత్వం స్పందించి ఇసుకను అక్రమరవాణా చేస్తున్న దళారులపై చర్యలు తీసుకొని అడ్డుకట్ట వేయాల ని ప్రజలు కోరుతున్నారు. కాగా అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇటీవల సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణాకు చెక్‌ పడేనా వేచిచూడాల్సిందే మరి.

Updated Date - 2021-06-20T06:04:51+05:30 IST