గూగుల్ మోసం చేస్తోందా ? కోర్టుకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-05-28T21:59:22+05:30 IST

ప్రముఖ సమాచారం సంస్థ ‘గూగుల్’... వినియోగదారులను మోసం చేస్తోందని అమెరికాలోని అరిజోనా రాష్ట్రం కోర్టుని ఆశ్రయించింది. అరిజోనా రాష్ట్రానికి చెందిన ఓ న్యాయవాది... మోసపూరితమైన, అన్యాయమైన మార్గాల ద్వారా వినియోగదారులను గూగుల్ సంస్థ మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. 'గూగుల్ సంస్థ తన వినియోగదారుల వివరాలను సేకరిస్తుందన్న విషయం తెలిసిందే.

గూగుల్ మోసం చేస్తోందా ? కోర్టుకు ఫిర్యాదు

అరిజోనా : ప్రముఖ సమాచారం సంస్థ ‘గూగుల్’... వినియోగదారులను మోసం చేస్తోందని అమెరికాలోని అరిజోనా రాష్ట్రం కోర్టుని ఆశ్రయించింది. అరిజోనా రాష్ట్రానికి చెందిన ఓ న్యాయవాది...  మోసపూరితమైన, అన్యాయమైన మార్గాల ద్వారా వినియోగదారులను  గూగుల్ సంస్థ మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. 'గూగుల్ సంస్థ తన వినియోగదారుల వివరాలను సేకరిస్తుందన్న విషయం తెలిసిందే.


వినియోగదారులు ఎక్కడికి వెళ్తున్నారు ? అన్న వివరాలను కూడా ఆ సంస్థ సేకరిస్తుంది. సరైన ప్రకటనలనివ్వడానికిగాను గూగుల్ ఈ వివరాలను సేకరిస్తుంది. ‘వివరాలు సేకరించే ముందు వినియోగదారుల అనుమతిని గూగుల్ సంస్థ తీసుకోవడం లేదు' అని అటార్నీ జనరల్ మార్క్ బ్రూనోవిచ్ సోషల్ మీడియా వేదికగా చెప్పాడు.


కాగా ఈ కన్స్యూమర్ ఫ్రాడ్ కేసుపై గూగుల్ సంస్థ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ... ‘ఎవరైతే కన్స్యూమార్ ఫ్రాడ్ కేసు నమోదు చేశారో... వారు ఖచ్చితంగా మా సేవలను తప్పుగా అర్థం చేసుకున్నారని మేము భావిస్తున్నాం. మేము ఎప్పుడూ కూడా మా వినియోగదారుల భద్రతకు భంగం కలిగించడం జరగదు. మా ప్రతి ప్రొడక్టు సేకరించిన లోకేషన్ సమాచారం మొత్తం చాలా భద్రంగా నిల్వ చేయబడుతుంది' అని స్పష్టం చేశారు.


ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం తన వినియోగదారుల వ్యక్తిగత విషయాలను సేకరిస్తుందని అరిజోనా రాష్ట్రానికి చెందిన వారు కేసు వేశారు. వినియోగదారులు తమ లొకేషన్ షేర్ చేయకుండా ఉండేందుకు ప్రయత్నించినా... గూగుల్ సంస్థ మాత్రం ఏదో ఒక రూపంలో వినియోగదారుల లొకేషన్ సమాచారాన్ని సేకరిస్తుంది అని వాషింగ్టన్ పోస్ట్ పత్రికతో మాట్లాడుతూ న్యాయవాది మార్క్ బ్రూనోవిచ్ చెప్పుకొచ్చాడు. 


ఫిబ్రవరి నెలలో న్యూ మెక్సికో కు చెందిన హెక్టార్ అనే మరో న్యాయవాది కూడా గూగుల్ సంస్థ పై కేసు వేశాడు. గూగుల్ సంస్థ తయారు చేసిన ఎడ్యుకేషనల్ సాఫ్ట్‌వేర్... పిల్లల  లోకేషన్ సమాచారాన్ని తల్లిదండ్రుల అనుమతి లేకుండా సేకరిస్తో్ందని ఆయన గూగుల్ సంస్థ పై కేసు వేశాడు. 

Updated Date - 2020-05-28T21:59:22+05:30 IST