ఒప్పందం అమలయ్యేనా?

ABN , First Publish Date - 2022-09-03T06:05:10+05:30 IST

మండలంలోని గోండ్రియాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్‌ పదవిని ఒప్పందం ప్రకారం కాంగ్రెస్‌ సానుభూతిపరుడికి అప్పగిస్తారా? లేదా? అనే సంశయం నెలకొంది.

ఒప్పందం అమలయ్యేనా?

కాంగ్రెస్‌కు గోండ్రియాల పీఏసీఎస్‌  చైర్మన్‌ దక్కేనా..

  అయోమయంలో అధికార పార్టీ నాయకులు

 అనంతగిరి, సెప్టెంబరు 2:  మండలంలోని  గోండ్రియాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్‌ పదవిని ఒప్పందం ప్రకారం కాంగ్రెస్‌ సానుభూతిపరుడికి అప్పగిస్తారా? లేదా? అనే సంశయం నెలకొంది.  మండంలోని గోండ్రియాల, లకారం, కొత్తగూడెం గ్రామాలను ఒక క్లస్టర్‌గా గోండ్రియాల పీఏసీఎ్‌సను ఏర్పాటుచేశారు. లకారానికి మూడు, కొత్తగూడేనికి రెండు, గోండ్రియాల గ్రామానికి ఎనిమిది డైరెక్టర్లను కేటాయించా రు.   2020 ఫిబ్రవరిలో జరిగిన సహకారం సంఘం ఎన్నికల్లో గోండ్రియాల గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ సానుభూతిపరురాలు నెల్లూరి ఉషారాణి, అదే గ్రామాని కి చెందిన కాంగ్రెస్‌ సానుభూతిపరుడు నెల్లూరి వెంకటప్పయ్య డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు.  చైర్మన్‌ పదవి గోం డ్రియాల గ్రామానికి చెందిన వారికే దక్కాలని చెరో రెం డు సంవత్సరాలు పదవిలో ఉండే విధంగా గ్రామ పెద్ద ల సమక్షంలో ఉషారాణి, వెంకటప్పయ్య ఒప్పందం చేసుకున్నారు.   ముందుగా చైర్మన్‌ పదవిని చేపట్టిన నెల్లూరి ఉషారాణి పదవీ కాలం రెండున్నర సంవత్సరా లు ఆగస్టు నెలతో ముగింది. అయితే ఒప్పందం ప్రకా రం వెంకటప్పయ్యకు చైర్మన్‌ పదవిని అప్పగించాల్సి ఉంది.  ఈ ఒప్పందం అమలుకాని పక్షంలో  తమ హోదాకు విలువ ఉండదని గ్రామ పెద్దలు మదనపడుతున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం విషయమై చైర్మన్‌ ఉషారాణిని వివరణ కోరగా ఎమ్మెల్యే  సూచించిన విధంగా నడుచుకుంటామన్నారు.  ఒప్పందం ప్రకారం తనకు చైర్మన్‌ పదవిని అప్పగించాలని  వెంకటప్పయ్య అన్నారు. లేనట్లయితే మూడేళ్ల తర్వాత అవిశ్వాసం ప్రవేశపెట్టవచ్చని, మూడేళ్ల గడువుకు మరో ఆరు నెలల సమయం ఉందన్నారు. ఆరు నెలల తర్వాత చైర్మన్‌పై అవిశ్వాసం పెడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు  సమీపిస్తున్నందున  అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సానుభూతిపరురాలని కాదని,  ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సా నుభూతిపరుడికి సొసైటీ చైర్మన్‌ పదవిని కట్టబెడితే టీఆర్‌ఎస్‌ పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందని అధికార పార్టీ నాయకులు వాపోతున్నారు. ఒప్పందం అమలుచేస్తారా? లేదా? అనే ఉత్కంఠ  ప్రజల్లో నెలకొంది. 



Updated Date - 2022-09-03T06:05:10+05:30 IST