ఎర్రజొన్నలకు ధర లభించేనా?

ABN , First Publish Date - 2021-02-23T05:58:04+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ప్రాంతంలోని ఎర్రజొన్న రై తులు అయోమయానికి గురవుతున్నారు. ఎర్రజొన్నలకు క్వింటాకు రూ.200 తగ్గడం రైతులను ఆందోళనకు గురి చే స్తోంది. మొన్నటి వరకు క్వింటాకు రూ.3,800 చొప్పున ఒ ప్పందాలు జరగగా ఆదివారం నుంచి రూ.3,600 విక్రయా లు జరుగుతున్నాయి.

ఎర్రజొన్నలకు ధర లభించేనా?

క్వింటాకు రూ.200 తగ్గిన ధర 

అయోమయంలో రైతులు 

నిల్వ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్న వైనం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 22: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ప్రాంతంలోని ఎర్రజొన్న రై తులు అయోమయానికి గురవుతున్నారు. ఎర్రజొన్నలకు క్వింటాకు రూ.200 తగ్గడం రైతులను ఆందోళనకు గురి చే స్తోంది. మొన్నటి వరకు క్వింటాకు రూ.3,800 చొప్పున ఒ ప్పందాలు జరగగా ఆదివారం నుంచి రూ.3,600 విక్రయా లు జరుగుతున్నాయి. ధర తగ్గడంతో రైతులు అయోమ యానికి గురవుతున్నారు. సీజన్‌ ప్రారంభంలో 15రోజుల క్రి తం మోర్తాడ్‌ గ్రామంలో క్వింటాకు రూ.3,800లకు కొనుగో లుకు ఒక వ్యాపారి ఒప్పందం చేసుకున్నాడు. దీంతో ఆర్మూ ర్‌ ప్రాంతంలోని ఎర్రజొన్న రైతులకు ఎంతో ఊరట లభించి ంది. ఈయేడు ఏ పంటకు కూడా సరైన ధర లభించలేదు. మక్కలు క్వింటాకు రూ.500 తక్కువకు విక్రయించారు. గ తంలో కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధరకు విక్రయించే వారు. ఈసారి ప్రభుత్వం మక్క పంటను నిషేధించినందు న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా రై తులు క్వింటాకు రూ.1,200 చొప్పున వ్యాపారులకు విక్రయి ంచారు. రైతులు మక్కలు విక్రయించిన తర్వాత ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వరి సాగులోనూ రై తులు నష్టాలను చవిచూశారు. సన్నరకాలను సాగు చే యాలని ప్రభుత్వం సూచించడంతో రైతులు ఆ రకాలనే సాగు చేశారు. తీరాది గుబడి రాకపోవడంతో ఆర్థికంగా న ష్టపోయారు. పసుపు పంటకు కూడా ధర లభించడం లే దు. పసుపు ధర మొదట్లో పెరిగి ఆ తర్వాత తగ్గిపోయింది. పసుపు కూడా లాభదా యకంగా లేదు. మూడు పంటల వల్ల నష్టపోయినందున ఎర్రజొన్న తమను ఆదుకుంటుంద ని రైతులు భావించారు. కర్నాటక రాష్ట్రంలోని బళ్లారిలో ఈ సారి పంట దెబ్బతిన్నది. తేనే రావడంతో పాటు గింజలు సన్నగా వచ్చాయి. ప్రతీసారి బళ్లారిలో వచ్చిన దిగుబడి ధ రను ప్రభావితం చేస్తుంది. బళ్లారిలో విస్తీర్ణం పెరిగి దిగుబ డి బాగా వస్తే ఆర్మూర్‌ ప్రాంత ఎర్రజొన్నలకు ధర తగ్గుతు ంది. ఆర్మూర్‌ కంటే ముందే బళ్లారి పంట వస్తుంది. ఈసా రి బళ్లారిలో పంట దెబ్బతినడంతో ఎర్రజొన్నలకు డిమాండ్‌ ఉంటుందని రైతులు భావించారు. రైతులు భావించినట్లే మోర్తాడ్‌లో అత్యధిక ధర రావడంతో ఆశలు రేకెత్తాయి. కా నీ, పంట చేతికి వచ్చే సమయంలో వ్యాపారులు వ్యూహాత్మ కంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ ధర ఉందని, ఈ ధరతో కొనుగోలు చేసి దందా చేయలేమనే ఉద్దేశంతో స్తబ్దుగా ఉం టున్నారు. దీంతో కొందరు రైతులు ధర తగ్గించుకుని విక్ర యిస్తున్నారు. మోర్తాడ్‌లో క్వింటాకు రూ.3,800లకు ఒప్పం దం జరగగా.. ఆ ధర కంటే రూ.200 తక్కువ ధరకు విక్ర యిస్తున్నారు. ఇంకా తగ్గితే తమకు బాగా నష్టం జరుగుతు ందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఎర్రజొన్నలు విక్రయానికి వస్తున్నాయి. సీజన్‌  ప్రారంభం లో విత్తే ముందు వ్యాపారులకు, రైతులకు మధ్య క్వింటాకు రూ.2,200నుంచి రూ.2,500 వరకు ఒప్పందం జరిగింది. ఒ క గ్రామంలో రూ.2,200, మరో గ్రామంలో రూ.2,300, ఇంకో గ్రామంలో రూ.2,400 ఇలా ఒప్పందాలు జరిగాయి. పెరిగి తే పెరిగిన ధర అని రాసుకున్నారు. మోర్తాడ్‌ గ్రామంలో రూ.3,800 కొనుగోలు ఒప్పందం జరగడంతో అన్ని గ్రామా ల్లో ఈ ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీలో రూ.4,200 నుంచి రూ.4,500 వరకు విక్రయాలు జరుగుతు న్నాయి. అయితే, వ్యాపారులు మాత్రం తమకు ఖర్చులుం టాయని, ధర ఎక్కువ పెడితే నష్టపోతామని అంటున్నారు. 

వేచి చూసే ధోరణిలో రైతులు

 వ్యాపారుల మాదిరే కొంత మంది రైతులు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఈసారి ఉత్తర భారతదేశంలో డి మాండ్‌ ఉందని, కొన్ని రోజులు నిల్వ చేసుకుంటే ధర పెరు గుతుందని రైతులు భావిస్తున్నారు. గతంలో శీతల గిడ్డంగులు లేక నిల్వ చేసుకోడానికి అవకాశం లేదు. ప్రస్తు తం శీతల గిడ్డంగులు ఆర్మూర్‌ ప్రాంతంలోనే ఉన్నాయి. వా టిలో నిల్వ చేసుకుని ధర వచ్చినప్పుడు విక్రయించాలని రైతులు భావిస్తున్నారు. 

దెబ్బతిన్న పంట

 ఆర్మూర్‌ ప్రాంతంలో సుమారు 50వేల ఎకరాల్లో పంట సాగవుతోంది. ఈసారి వాతావరణ ప్రభావం వల్ల పంట దె బ్బతిన్నది. పంటకు తేనే వచ్చింది. పురుగుల ప్రభావం కూ డా బాగా కనిపించింది. పురుగుల నివారణకు రైతులు 10జీ గుళికలు వాడేవారు. ప్రభుత్వం ఆ గుళికలను నిషేధించ డంతో ఇతర మందుల వల్ల పురుగుల ప్రభావం తగ్గలేదు. దీంతో దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గినా ధర ఉంటే గట్టె క్కుతా మని రైతులు భావిస్తున్నారు.

Updated Date - 2021-02-23T05:58:04+05:30 IST