పేటలో 100 పడకల ఐసోలేషన్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2021-05-06T05:35:42+05:30 IST

పేటలో 100 పడకల ఐసోలేషన్‌ సెంటర్‌

పేటలో 100 పడకల ఐసోలేషన్‌ సెంటర్‌
ఐసోలేషన్‌ సెంటర్‌ను ప్రారంభించి పడకలను పరిశీలిస్తున్న ఉదయభాను

జగ్గయ్యపేట, మే 5: బలుసుపాడు రోడ్డులోని గురుకుల పాఠశాలలో వంద పడకలతో కొవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌ను బుధవారం ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను  ప్రారంభించారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న అనంతరం తొలిసారిగా గురుకుల పాఠశాలలో అఖిలపక్ష నేతలు, అధికారులతో ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో అక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.45 లక్షలు బూదవాడ అలా్ట్రటెక్‌ సిమెంట్స్‌ సీఎస్సార్‌ నిధుల నుంచి ఇచ్చేందుకు అంగీకరించిందని ఉదయభాను తెలిపారు. తన తల్లిదండ్రుల పేరున తాను రూ.5లక్షలు అందజేయనున్నట్టు తెలిపారు. గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌ నిర్వహణకు రూ.5 లక్షల చెక్‌ను తహసీల్దార్‌ రామకృష్ణకు అందజేశారు. పాక్షిక కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని కోరారు. తహసీల్దార్‌ రామకృష్ణ, కమిషనర్‌ సుభాష్‌ చంద్రబోస్‌, సీఐ చంద్రశేఖర్‌, ఎస్సైలు చినబాబు, రామారావు, ఎండీవో జయచంద్ర, వైసీపీ పట్టణ అధ్యక్షుడు చౌడవరపు జగదీష్‌, గెల్లా పూర్ణ, ఫిరోజ్‌ఖాన్‌, జె.శ్రీనివాసరావు, ప్రభుదాస్‌ పాల్గొన్నారు.



Updated Date - 2021-05-06T05:35:42+05:30 IST