100 పడకలతో ఐసోలేషన్‌ వార్డు

ABN , First Publish Date - 2020-04-05T10:10:27+05:30 IST

సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో 100 పడకలతో కరోనా ఐసోలేషన్‌ వార్డును సిద్ధం చేశారు. కరోనా వైరస్‌ లక్షణాలతో ఎవరైనా వస్తే చికిత్స అందించేందుకు 20 పడకల

100 పడకలతో ఐసోలేషన్‌ వార్డు

సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో సిద్ధం

నిరంతర పర్యవేక్షణ కోసం 12 సీసీ కెమెరాల ఏర్పాటు

మూడు షిప్టుల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది


సంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 4 : సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో 100 పడకలతో కరోనా ఐసోలేషన్‌ వార్డును సిద్ధం చేశారు. కరోనా వైరస్‌ లక్షణాలతో ఎవరైనా వస్తే చికిత్స అందించేందుకు 20 పడకల ఐసీయూ, 80 పడకలతో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచారు. ఆస్పత్రిలో ఎంఎం, ఎఫ్‌ఎం, ఏఎంసీ, బర్స్‌, సైక్యార్టిస్టు వార్డులల్లో స్వల్ప మార్పులు చేసి ఈ వార్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ శాఖ ఆధ్వర్యంలో ఐసోలేషన్‌ వార్డుల ఆధునీకరణ పనులు పూర్తిచేశారు.


అయితే ఈ వార్డుల్లో పర్యవేక్షణ చేసేందుకు 12 సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. జిల్లాలో రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు తగిన ఏర్పాట్లుచేశారు. ఆస్పత్రికి కరోనా బాధితులు ఎవరూ రానప్పటికీ మూడు షిప్టుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో ఇప్పటివరకు కరోనా వైరస్‌ లక్షణాలతో ఎవరూ అడ్మిట్‌ కాలేదని, అప్రమత్తంగా ఉన్నామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కే.సంగారెడ్డి తెలిపారు. 


జిల్లాలో క్వారంటైన్‌లో 95 మంది

సంగారెడ్డి అర్బన్‌ : సంగారెడ్డి జిల్లాలో 95 మంది క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నారు. సంగారెడ్డి మండలం ఫసల్‌వాది గ్రామ శివారలోఓని ఎంఎన్‌ఆర్‌లో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌ కేంద్రంలో ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 15 మంది ఉండగా.. ఇస్నాపూర్‌ సమీపంలోని చిట్కుల్‌ మహేశ్వర మెడికల్‌ కళాశాల క్వారంటైన్‌ కేంద్రంలో ఘజియాబాద్‌ నుంచి వచ్చిన 14 మంది ఉన్నారు.  జిల్లాలో రెండురోజుల క్రితం ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే.


అయితే వారి కుటుంబసభ్యులతో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన మరో 66 మందిని పాటి సమీపంలోని నారాయణ కళాశాల క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచారు. నారాయణ కళాశాల క్వారంటైన్‌లో ఉన్న 66 మందిలో 38 మంది రక్త నమూనాలను సీసీఎంబీకి తరలించారు. ఈ 38 మందికి సంబంధించిన కరోనా పరీక్షల నిర్ధారణ కోసం అధికారులు వేచి చూస్తున్నారు. కాగా విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 25 మంది హోం క్వారంటైన్‌లో అధికారుల పర్యవేక్షణలో ఉన్నారని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌ తెలిపారు. 


వెంకటరత్నాపూర్‌లో యువకుడికి క్వారంటైన్‌

తూప్రాన్‌రూరల్‌: మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలంలోని వెంకటరత్నాపూర్‌కు చెందిన యువకుడు (34) శుక్రవారం కర్నూలు నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకుని పరీక్షలు చేయకుండా క్వారంటైన్‌లో ఉండాలని సూచించి వెళ్లారు. అయితే అతడు యథేచ్ఛగా బయట తిరుగుతుండడంతో గ్రామ్థులు ఆందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2020-04-05T10:10:27+05:30 IST