టీకా పంపిణీ సక్సెస్.. ఇక మాస్కులు పెట్టుకోనక్కర్లేదు!

ABN , First Publish Date - 2021-04-18T22:39:10+05:30 IST

బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కులు ధరించాలని వివిధ దేశాల ప్రభుత్వాలు ప్రజలను అభ్యర్ధిస్తుంటే ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం ఆ అవసరం తీరిపోయిందని తాజాగా ప్రకటించింది.

టీకా పంపిణీ సక్సెస్.. ఇక మాస్కులు పెట్టుకోనక్కర్లేదు!

టెల్‌ అవీవ్: బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కులు ధరించాలని వివిధ దేశాల ప్రభుత్వాలు ప్రజలను అభ్యర్ధిస్తుంటే ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం ఆ అవసరం లేదని తాజాగా ప్రకటించింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించనక్కర్లేదని స్పష్టం చేశారు. మాస్కులను తప్పనిసరి చేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ తాజాగా కీలక ప్రకటన జారీ చేసింది. అయితే.. ప్రజలు గుమిగూడే ప్రదేశాల్లో మాత్రం కచ్చితంగా మాస్కు ధరించాలని స్పష్టం చేసింది. ఇన్‌డోర్ స్టేడియంలు వంటి ప్రదేశాలకూ ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఇజ్రాయెల్ చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమవడంతో.. దేశంలో 16 ఏళ్లకు పైబడిన వారిలో దాదాపు 81 శాతం మంది కరోనా టీకా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాస్కులు అవసరం లేదని ప్రకటించింది. ప్రస్తుతం అక్కడి ప్రజలకు ప్రభుత్వం ఫైజర్ టీకా వేస్తోంది.

Updated Date - 2021-04-18T22:39:10+05:30 IST