దైనిక్ భాస్కర్‌పై ఐటీ దాడులు
ABN , First Publish Date - 2021-07-23T07:19:32+05:30 IST
ఉత్తరప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ జాతీయ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ గ్రూప్
- భారత్ సమాచార్ చానల్‌పైనా
- పన్ను ఎగవేతే కారణం?
- తీవ్రంగా ఖండించిన విపక్షాలు
- కొవిడ్ లోపాలపై వార్తలు రాసినందుకేనని ఆరోపణ
- పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరణ
న్యూఢిల్లీ, జూలై 22: ఉత్తరప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ జాతీయ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ గ్రూప్, భారత్ సమాచార్ న్యూస్ చానల్‌పై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీ, భోపాల్, అహ్మదాబాద్, జైపూర్, లఖ్‌నవూ తదితర నగరాల్లోని దైనిక్ భాస్కర్ గ్రూపు కార్యాలయాలతోపాటు.. ప్రమోటర్లు, ఇతర అధికారుల ఇళ్లపై గురువారం తెల్లవారుజామున 5.30 నుంచి ఏకకాలం లో దాడులు జరిగాయి. ఆదాయపన్ను ఎగవేతే కారణమని ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నా.. అందుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
దైనిక్ భాస్కర్ హిం దీలో 12 రాష్ట్రాల్లో పత్రికను అందజేస్తుండగా.. గుజరాత్ భాష లో ప్రత్యేకంగా గుజరాత్ భాస్కర్ పత్రికను నడుపుతోంది. వీటితోపాటు హిందీలో ఎఫ్‌ఎం రేడియో, న్యూస్ యాప్‌లను నిర్వహిస్తోంది. దైనిక్ భాస్కర్ యాజమాన్యం టెక్స్‌టైల్స్, మై నింగ్ రంగంలోనూ ఉండడంతో.. ఆ కోణంలోనూ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అటు యూపీ కేంద్రంగా పనిచేస్తున్న హిందీ న్యూస్ చానల్ ‘భారత్ సమాచార్’ కార్యాలయాలు, ప్రమోటర్లు, డైరెక్టర్ల ఇళ్లపైనా ఐటీ అధికారులు దాడులు చేశారు. కొవిడ్-19 సెకండ్‌వేవ్ తారస్థాయిలో ఉన్న ఏప్రిల్, మే నెలల్లో ఈ రెండు వార్తా సంస్థలు కేంద్రం వైఫల్యాన్ని ఎండగడుతూ కథనాలు ఇచ్చాయి. అందుకే ఈ దాడు లు జరుగుతున్నాయంటూ విపక్షాలు మండిపడ్డాయి.
‘‘కరోనా కట్టడిలో మోదీ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపినందుకు దైనిక్ భాస్కర్ మూల్యం చెల్లిస్తోంది. అరుణ్‌శౌరీ చెప్పినట్లు ఇది అప్రకటిత ఎమర్జెన్సీ. ఎమర్సెన్సీకి మరోరూపం’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విటర్‌లో ఆరోపించా రు. ఐటీ శాఖ చర్యను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. ఐటీ దాడులను మీడియా అణచివేతగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ అన్నారు. పలువురు విపక్ష సభ్యులు ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తారు. దా నికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానమిస్తూ.. వాస్తవాలను తెలుసుకోకుండా ఆరోపణలు సరికాదన్నారు. ‘‘ఐటీ శాఖ తనపని తాను చేసుకుపోతోంది’’ అని వ్యాఖ్యానించారు.