పట్టు తప్పితే ప్రమాదమే!

ABN , First Publish Date - 2021-06-23T05:06:55+05:30 IST

పట్టణంలోని పాత బస్టాండు ప్రాంతంలో సిండికేట్‌ బ్యాంక్‌ దగ్గర ఉన్న షాపులకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

పట్టు తప్పితే ప్రమాదమే!
ప్రమాదకరంగా చెక్కల వంతెనలు

ఆదోని టౌన్‌, జూన్‌ 22: పట్టణంలోని పాత బస్టాండు ప్రాంతంలో సిండికేట్‌ బ్యాంక్‌ దగ్గర ఉన్న షాపులకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. షాపుల ఎదురుగా ఉన్న పెద్ద కాలువపై కాంక్రిట్‌ స్లాబ్‌ వేయడానికి మున్సిపల్‌ అధికారులు ఉన్న బండలను తొలగించారు. నెల రోజులవుతున్నా పని ప్రారంభం కాకపోవడంతో షాపుల యజమానులు కస్టమర్ల కోసం చెక్కలు, కట్టెలతో తాత్కాలిక వంతెనలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇవి ప్రమాదకరంగా ఉన్నాయి. వాటి మీద నుంచి దాటేటప్పుడు ఏ మాత్రం పట్టు జారినా పెద్ద కాలువలో పడిపోవాల్సిందే. దీంతో పిల్లలు, వృద్ధులు, మహిళలు ఆ షాపులకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారాలు అంతంత మాత్రమే ఉండగా ఈ వంతెనతో మరింత నష్టపోతున్నామని దుకాణాదారులు వాపోతున్నారు. ప్రస్తుతం కర్ఫ్యూ సడలించడంతో వ్యాపారాలు పెరిగే అవకాశం ఉందని, వెంటనే కాలువలపై స్లాబ్‌ వేసే పనులు చేపట్టాలని కోరుతున్నారు. కాగా ఈ నెలాఖరులో పనులు ప్రారంభించి త్వరగానే ముగిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ చెబుతున్నారు.


Updated Date - 2021-06-23T05:06:55+05:30 IST