విద్యుత్తు వాహనాలు.. ‘కొనుగోలు’ ఇక తేలిక

ABN , First Publish Date - 2020-09-23T02:47:42+05:30 IST

విద్యుత్తు వాహనాలను లీజు ప్రాతిపదికన కొనుగోలు చేయడం ఇప్పుడు మరింత సులభంగా మారింది. ఓటీఓ(OTO) క్యాపిటల్ సంస్థ భాగస్వామ్యంతో... భారత్ కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘ఒకినావా’... వాహనాలను లీజు ప్రాతిపదికన కొనుగోలు చేసే విధానాన్ని మరింత సులభతరం చేస్తూ ఓ ప్రయోగాత్మక ప్రయత్నానికి మంగళవారం శ్రీకారం చుట్టింది.

విద్యుత్తు వాహనాలు.. ‘కొనుగోలు’  ఇక తేలిక

గురుగావ్ : విద్యుత్తు వాహనాలను లీజు ప్రాతిపదికన కొనుగోలు చేయడం ఇప్పుడు మరింత సులభంగా మారింది. ఓటీఓ(OTO)  క్యాపిటల్ సంస్థ భాగస్వామ్యంతో... భారత్ కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘ఒకినవా’... వాహనాలను లీజు ప్రాతిపదికన కొనుగోలు చేసే విధానాన్ని మరింత సులభతరం చేస్తూ ఓ ప్రయోగాత్మక ప్రయత్నానికి మంగళవారం శ్రీకారం చుట్టింది.


ఇందుకోసం మరో ప్రముఖ వ్యాపార సంస్థ... ఓటీఓ తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ సంస్థ ద్వారా లీజు ప్రాతిపదికన కొనుగోలు చేసే వాహనాల విలువను... 12 నుంచి 36 నెలల వాయిదాల్లో చెల్లించవచ్చు. బెంగళూరు, పూనే నగరాల్లో మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ సదుపాయాన్ని... మరికొద్ది నెలల్లో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.


కాగా... ‘ఆన్‌లైన్’ ద్వారా ఒకినావ వాహనాలను బుక్ చేసుకునే కొనుగోలుదారులకు... తేలికగా ఉండే ఫైనాన్సింగ్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. కాగా... వాహన విలువకు సంబంధించి వాయిదాలను చెల్లించే క్రమంలో... కొనుగోలుదారులకు మరింత వెసులుబాటును కల్పించేందుకుగాను... ఓటీఓ సంస్థ ఏర్పాట్లు చేయడం విశేషం. దీంతో... కొనుగోలుదారులకు 30 శాతం వరకు ఆదా అవుతుందని సంస్థ వర్గాలు వెల్లడించాయి.


ఉదాహరణకు... వాహన విలువ ప్రాతిపదికన... నెలకు రూ. 3,960 చొప్పున వాయిదాల పద్దతిలో రెండేళ్ళ వ్యవధిలో మొత్తం విలువను చెల్లించేలా... కొనుగోలుదారుడెవరైనా ఏదేని బ్యాంకు రుణం ద్వారా ఆప్షన్ ను పెట్టుకున్నాడనుకుంటే... అదే విలువ ‘ఓటీఓ‘ ద్వారానైతే... కేవలం రూ. 2,950 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ క్రమంలో... కొనుగోలుదారులపై భారం గణనీయంగా తగ్గిపోతుంది. కాగా... ‘కోవిడ్’ నేపధ్యంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా ప్రయాణించేందుకు ప్రజలు కొంత విముఖతను ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే.


ఈ క్రమంలోనే... అటు వాయుకాలుష్యం, కర్బన ఉద్గారాల విడుదల వంటి పరిణామాలను సాధ్యమైనంత మేరకు నియంత్రించడం, కోవిడ్ ప్రమాదాన్నుంచి దూరంగా ఉండేందుకు... విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఇందుకోసం కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కొత్త విధానాలను కూడా ప్రకటించాయి. కాగా... కొనుగోలుదారులకు ఈ విధానాలు వెసులుబాటు కల్పించేలా ఉన్నాయని కూడా భావిస్తున్నారు.


కాగా... ‘ఓటీఓ’తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఒకినవ సంస్థ... ఈ అంశాన్నే పరిగణనలోనికి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ‘ఇ-మొబిలిటీ’ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూండడం కూడా ఇందుకు ఓ కారణమని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. తమతో కుదిరిన ఒప్పందం నేపధ్యంలో... ఓటీఓ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ జితేందర్ శర్మ మాట్లాడుతూ... ‘ఈ-మొబిలిటీ’ని పెంచే దిశగా... ప్రభుత్వాలు కూడా దృష్టి సారించిన నేపధ్యంలో... ఒకినవతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.


కాగా... మొదటి వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే క్రమంలో... విద్యుత్తు వాహనాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. మిగతా వాహనాలతో పోల్చుకుంటే... విద్యుత్తు వాహనాల కొనుగోలు ఖర్చు తక్కువగా ఉండడం, వాటి నిర్వహణ కూడా తేలికగా ఉండడం, అందుకు కూడా తక్కువ వ్యయమే కానుండడం కూడా ఇందుకు కారణాలు కావచ్చని భావిస్తున్నారు.


ఇక... పండుగల నేపధ్యంలోనూ, ఆన్‌లైన్ లోనూ తమ విద్యుత్తు వాహనాలను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు మరింత ఆకర్షితులవుతారని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం 25 శాతం డీలర్ల ద్వారానే... కేవలం నెల రోజుల వ్యవధిలోనే వెయ్యికి పైగా వాహనాలను విక్రయించగలగడం ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.
 

Updated Date - 2020-09-23T02:47:42+05:30 IST