నమ్మించి మోసం చేసిన జగన : మాజీ ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-09-15T05:08:38+05:30 IST
అన్నదాతలకు అన్ని విదాల అండగా ఉంటామని నమ్మించి వంచించారని, అధికారంలోకి వచ్చాక రైతన్నలను విస్మరించారని మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న అన్నారు.
మడకశిర టౌన, సెప్టెంబరు 14: అన్నదాతలకు అన్ని విదాల అండగా ఉంటామని నమ్మించి వంచించారని, అధికారంలోకి వచ్చాక రైతన్నలను విస్మరించారని మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న అన్నారు. మంగళవారం రైతు సమస్యలపై టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. చౌటిపల్లి గ్రామం వద్ద రైతుల వేరుశనగ పొలాలను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ బైఠాయించి రైతు సమస్యలు పరిష్కరించాలని ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం వంటి కార్యక్రమాలతో రైతులకు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని దీంతో రైతన్నలు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందన్నారు. అనంతరం తహసీల్దార్ ఆనంద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆదినారాయణ, అశ్వత్తామప్ప, మాజీ మున్సిపల్ చైర్మన ప్రకాష్, నాయకులు రాజగోపాల్, కిష్టప్ప, రమేష్ తదితరులు పాల్గొన్నారు.