Advertisement
Advertisement
Abn logo
Advertisement

99,936 మంది విద్యార్థులకు విద్యా దీవెన

జగనన్న విద్యా దీవెన చెక్కు విడుదల చేస్తున్న హోం మంత్రి సుచరిత, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు

గుంటూరు, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా జిల్లాలో మూడో త్రైమాసిక విద్యా సంవత్సరంలో 99,936 మంది విద్యార్థులకు నగదు జమ చేసినట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌ నుంచి హోం మంత్రితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు జేవీడీ కార్యక్రమానికి హాజరయ్యారు. హోం మంత్రి మాట్లాడుతూ మొత్తం 88,919 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రూ.72.08 కోట్లు జమ  అయినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా, ఎమ్మెల్సీలు కల్పలత, లేళ్ల అప్పిరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌లు దినేష్‌కుమార్‌, రాజకుమారి, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వి.లక్ష్మణరెడ్డి, రాష్ట్ర పూసల సంఘం చైర్‌పర్సన్‌ కోలా భవాని, శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ ఫురుషోత్తమరావు, నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్‌లు వనమా బాలవజ్రబాబు, షేక్‌ షజీల, డీఆర్‌వో కొండయ్య, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదనరావు, మైనార్టీ సంక్షేమ అధికారి మస్తాన్‌ షరీఫ్‌ పాల్గొన్నారు. 

 

Advertisement
Advertisement