Abn logo
Jul 18 2021 @ 08:03AM

వ్యాక్సీన్ల కొరత: ‘బూత్ ఎక్కడో... వ్యాక్సీన్ అక్కడ’ ప్రచారం నిలిపివేత!

న్యూదిల్లీ: దిల్లీ ప్రభుత్వం జూన్ నుంచి ‘బూత్ ఎక్కడో... వ్యాక్సీన్ అక్కడ’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ ప్రచారానికి ఇప్పుడు బ్రేక్ పడింది. వ్యాక్సీన్ల కొరత కారణంగా దిల్లీ ప్రభుత్వం ఈ ప్రచారాన్ని నిలిపివేసింది. దిల్లీ ప్రభుత్వం తరపున వ్యాక్సినేషన్ బులెటిన్ విడుదల చేసే ఆప్ పార్టీ నేత ఆతిషీ మాట్లాడుతూ వ్యాక్సీన్ నిల్వలు చాలా తక్కువగా ఉన్నందున  ‘బూత్ ఎక్కడో... వ్యాక్సీన్ అక్కడ’ ప్రచారాన్ని నిర్వహించలేమన్నారు. ప్రస్తుతం ఒకరోజు వ్యాక్సీన్ అందుబాటులో ఉంటే, మరో రోజు ఉండటం లేదన్నారు. తక్కవ మోతాదులో వ్యాక్సీన్ ఉన్నకారణంగా ఈ ప్రచారాన్ని కొనసాగించలేమన్నారు. కరోనా థర్డ్ వేవ్ భయాల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ సప్లయ్‌ని మరింతగా పెంచాలని వేడుకుంటున్నామన్నారు. థర్డ్ వేవ్ వస్తుందన్న అంచనాల నేపధ్యంలో ఢిల్లీలోని ఆసుపత్రులలో మరిన్ని పడకలను, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.