పాక్‌కు భారత్‌ తీవ్ర హెచ్చరిక

ABN , First Publish Date - 2020-11-22T10:05:09+05:30 IST

నగ్రోటా వద్ద జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘటనపై పాకిస్థాన్‌కు భారత్‌ తీవ్ర హెచ్చరిక చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని

పాక్‌కు భారత్‌ తీవ్ర హెచ్చరిక

న్యూఢిల్లీ, నవంబరు 21: నగ్రోటా వద్ద జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘటనపై పాకిస్థాన్‌కు భారత్‌ తీవ్ర హెచ్చరిక చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం తక్షణం ఆపాలని డిమాండ్‌ చేసింది. న్యూఢిల్లీలోని పాక్‌ హైకమిషన్‌ కార్యాలయ ప్రతినిధిని పిలిపించి తన వైఖరిని సూటిగా  తెలిపింది. పాక్‌ రేంజర్ల సాయంతో కశ్మీర్లోకి చొరబడ్డ జైష్‌ టెర్రరిస్టులు ఓ ట్రక్కులో వెళుతుండగా నగ్రోటా టోల్‌ ప్లాజా వద్ద గస్తీ దళాలు అడ్డగించి ఎన్‌కౌంటర్‌ చేశాయి. వారి వద్ద నుంచి భారీగా ఆయుఽధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. భారీ విధ్వంసానికి కుట్ర జరిగిందని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే.

Updated Date - 2020-11-22T10:05:09+05:30 IST