Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోడ్డు ప్రమాదంలో జనగామ యువకుడి మృతి

ఆలేరు, డిసెంబరు 3: రోడ్డు ప్రమాదంలో జనగామకు చెందిన యువ కుడు మృతి చెందాడు. ఎస్‌ఐ ఎండీ ఇద్రీస్‌అలీ తెలిపిన వివరాల ప్రకారం.. జనగాం జిల్లా కేంద్రానికి చెందిన వినోద్‌కుమార్‌ (31) గురు వారం రాత్రి జనగాం నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వెళుతుండగా, మార్గమధ్యలో అతివేగంతో అజాగ్రత్తగా వస్తున్న డీసీఎం వాహనం ఆలేరులోని కమ్మ గూడెం శివారులో  వెనుక నుంచి ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వినోద్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.  మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. వినోద్‌కుమార్‌కు రెండేళ్ల క్రితం జనగామకు చెందిన యువతితో వివాహం కాగ, ఏడాది లోపు వయసున్న కుమారుడు  ఉన్నాడు. తండ్రి గతంలోనే మృతి చెందాడు. కూలి పనులకు వెళుతూ వినోద్‌కుమార్‌ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆలేరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. జనగాంకు చెందిన డీసీఎం యజమానిని, డ్రైవర్‌ను పిలిపి స్తానని వారితో మాట్లాడుకోమని ఎస్‌ఐ హామీ ఇవ్వడంతో వారు ఆందో ళనను విరమించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసు ్తన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  Advertisement
Advertisement