Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతు సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ

రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానం

జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

చెరుకుపల్లిలో జనసేన ప్రజాసభ

చెరుకుపల్లి, డిసెంబరు5: వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరిస్తోందని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. ఆదివారం చెరుకుపల్లిలో జరిగిన జనసేన ప్రజాసభలో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. సభకు జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. మనోహర్‌ మాట్లాడుతూ రూ.మూడు వేలు ఇస్తేనే పంట నష్టం జాబితాలో రైతులు పేర్లు చేరుస్తామని గ్రామ స్థాయి అధికారులు అనడం దారుణమన్నారు. దేశంలోనే రైతు ఆత్మహత్యలలో రాష్ట్రం రెండవ స్థానంలో ఉందన్నారు. జిల్లా రైతులు సొసైటీలు, మార్కుట్‌యార్డులలో నిల్వ ఉంచిన మొక్కజొన్నను వారికి తెలియకుండానే వైసీపీ నాయకులు అమ్ముకున్నారని అన్నారు. 217 జీవో ద్వారా మత్స్యకారుల అభ్యున్నతిని అడ్డుకున్నారన్నారు. ఇసుక రీచ్‌లను ప్రైవేటు కంపెనీలకు అప్పగించి ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారని, జనసేన అధికారంలోకి వస్తే గృహనిర్మాణం కోసం లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందిస్తామన్నారు. ఎస్టీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను ప్రభుత్వం తమ అవసరాలకు వాడుకుంటోందన్నారు. 30ఏళ్ల కిందట పక్కా గృహాలు నిర్మించుకుంటే ఇప్పుడు ఓటీఎస్‌ కట్టడం ఏంటన్నారు. అమరావతి రాజధాని రైతులను పాలకులు రోడ్డుపాలు చేశారన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతుల కోసం ఎక్కడా పనిచేసిన దాఖలాలులేవన్నారు.  చేనేత కార్మికుల సమస్యలను ప్రస్తుత ముఖ్యమంత్రి పట్టించుకోవటంలేదన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వ కార్యాలయాల ముందు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేనేత విభాగం చైర్మన్‌ చల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన రాష్ట్ర అదికార ప్రతినిఽదులు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌, రాష్ట్ర నాయకులు వడ్రాణం మార్కండేయబాబు, అమ్మిశెట్టి శ్రీనివాస్‌, మండలి దయాకర్‌, కమల్‌, పార్వతీనాయుడు, జనసేన ఎస్సీ, ఎస్టీ విభాగం నాయకుడు శ్రీనివాసరావు, జిల్లా నాయకులు మత్తి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచిన సభ్యులను అబినందించారు. 


Advertisement
Advertisement