Advertisement
Advertisement
Abn logo
Advertisement

చంద్రబాబు సీఎం అయ్యాక ఉచితంగా రిజిస్ట్రేషన్: జంగారెడ్డిగూడెం టీడీపీ నేతలు

జంగారెడ్డిగూడెం: చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక అందరికీ ఉచితంగా ఇళ్ల రిజిస్ట్రేషన్ చేసిస్తామని జంగారెడ్డిగూడెం టీడీపీ నేతలు చెప్పారు. సోమవారం అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం మండల టీడీపీ ఆధ్వర్యంలో సాయిల సత్యనారాయణ అధ్యక్షతన నివాళులు అర్పించారు. ఓటీఎస్ పథకాన్ని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యాం చంద్ర శేషు మాట్లాడుతూ.. ఓటీఎస్ పథకాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. 1983 నుంచి 2017 వరకు దాదాపు 56, 69, 891 మంది గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకున్నారని, వారిలో 46 లక్షల మందిని గుర్తించి 4,800 కోట్ల రూపాయలను వసూలు చేసి దోచుకోవాలని జగన్ సర్కారు ప్రయత్నిస్తోందని తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలంలోనే 4,216 మందిని గుర్తించారని, ఇప్పటికే 128 మంది నుంచి 10 లక్షలకు పైగా వసూలు చేశారని శేషు తెలిపారు. ఎవరో వేసిన మొక్కకి తాను యజమాని అని చెప్పుకుంటున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఈ విధానం మానుకోవాలని సూచించారు. ప్రజలెవ్వరు డబ్బులు చెల్లించవద్దని, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అందరికీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బొబ్బర రాజపాల్, పట్టణ, మండల కార్యదర్శులు తూటికుంట రాము, కుక్కల మాధవరావు, ఆకుమర్తి రామారావు, తూటికుంట దుర్గారావు, గొల్లమందల శ్రీనివాస్, యడ్లపల్లి కొండలరావు, ఎలికే ప్రసాద్, కొండపల్లి చంద్రరావు, వేములపల్లి శ్రీను షేక్ యాకుబ్, గంటా రామారావు, పాతూరి అంబెడ్కర్, లాగు సురేష్, తడికల మోహన్, గంపల రాజు, నిట్ట రామ్ కుమార్, గంటా శ్రీను, చిలంకురి బాబీ, అందుగుల శ్యామ్, నాగు, ఈర్ని సూరిబాబు, ఇతర టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement