జపాన్ మహాద్భుతం.. సెకండ్‌లో 319టీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్

ABN , First Publish Date - 2021-07-18T05:56:08+05:30 IST

మీ మోబైల్‌లో మీ డేటా స్పీడ్ ఎంత..? 1 ఎంబీపీఎస్.. లేక 5 ఎంబీపీఎస్.. ఇంకా ఎక్కువైతే ఓ 10 ఎంబీపీఎస్ వస్తుంది. ఇక మీ కంప్యూటర్లో..?..

జపాన్ మహాద్భుతం.. సెకండ్‌లో 319టీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్

మీ మోబైల్‌లో మీ డేటా స్పీడ్ ఎంత..? 1 ఎంబీపీఎస్.. లేక 5 ఎంబీపీఎస్.. ఇంకా ఎక్కువైతే ఓ 10 ఎంబీపీఎస్ వస్తుంది. ఇక మీ కంప్యూటర్లో..? 100 ఎంబీపీఎస్ లేదా 200 ఎంబీపీఎస్ వస్తుంది. కానీ ఎప్పుడైనా 319 టెరాబైట్ల ఇంటర్నెట్ స్పీడ్ గురించి ఆలోచించారా..? కనీసం మీ ఊహకు కూడా అందని ఈ మహా అద్భుతాన్ని జపాన్ సుసాధ్యం చేసింది. ప్రపంచమే ఔరా అని ముక్కున వేలేసుకునేలా చేసింది. ఈ స్పీడ్ గురించి ఒక్క మాటలో వివరించాలంటే ప్రస్తుతం మనం చూసే 2:30 గంటల సినిమాలు.. దాదాపు 57 వేల సినిమాలు ఒక్క సకండ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నమాట.


జపాన్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ(ఎన్ఐసీటీ) ఈ ఘనత సాధించింది. ఎన్ఐసీటీలోని బెంజమిన్ జే పుట్‌నం నేతృత్వంలోని రీసెర్చ్ టీం ఒక్క సెకనులో ఏకంగా 319 టెరాబైట్ల(టీబీపీఎస్) వేగంతో ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసి అబ్బురపరచింది. అయితే ఇంత భారీ డేటా స్పీడ్‌ను అందుకోవడానికి వారు ప్రస్తుతం వినియోగిస్తున్న ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌లోనే ప్రత్యేకమైన వాటిని వినియోగించారు. 0.125 మి.మీ ప్రామాణిక వ్యాసంలో 4-కోర్ ఆప్టికల్ ఫైబర్‌ను వినియోగించారు. వాటి ద్వారా సుదూరం నుంచి మొదటి ఎస్, సీ, ఎల్-బ్యాండ్ల ద్వారా డేటాను సక్సెస్‌ఫుల్‌గా ట్రాన్స్‌ఫర్‌ చేశారు. దాదాపు 30,001 కిలోమీటర్లకు కంటే ఎక్కువ దూరం నుంచి డేటా ట్రాన్స్‌మిషన్‌ను నిర్వహించినట్లు సమాచారం.


ఏది ఏమైనా టెక్నాలజీలో రోజురోజుకూ దూసుకుపోతున్న మనిషి.. ప్రతి రోజూ ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తున్నాడు. అలాంటి ఓ మహాద్భుతమైన ఆవిష్కరణే ఇదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో కూడా కేవలం 400 ఎంబీపీఎస్ స్పీడ్ ఉన్న ఇంటర్నెట్‌ను మాత్రమే వినియోగిస్తుంటారు. అలాంటిది తాజాగా సాధించిన ఇంటర్నెట్ స్పీడ్ అందుబాటులోకి వస్తే ప్రపంచమే మారిపోతుంది. మరి చూడాలి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఎప్పుడు వస్తుందో.

Updated Date - 2021-07-18T05:56:08+05:30 IST