Abn logo
Aug 9 2021 @ 08:12AM

Japan: లుపిట్ తుపాన్ ముప్పు...63 విమాన సర్వీసుల రద్దు

టోక్యో (జపాన్): జపాన్ దేశానికి లుపిట్ తుపాన్ ముప్పు పొంచి ఉంది. లుపిట్ తుపాన్ కారణంగా జపాన్ దేశంలోని హిరోషిమా, షిమనే, ఎమిమ్ ప్రాంతాల నుంచి 3 లక్షలమంది ప్రజలను ఖాళీ చేయించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జపాన్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. లుపిట్ తుపాన్ కారణంగా జపాన్ దేశంలోని నైరుతి ప్రాంతంలో 63 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు జపాన్ అధికారులు చెప్పారు.లుపిట్ తుపాన్ కారణంగా సెకనుకు 23 మీటర్ల నుంచి 35 మీటర్ల వరకు గాలులు వీస్తాయని జపాన్ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. లుపిట్ తుపాన్ వల్ల గురువారం చైనా దేశంలోని తీర ప్రాంతాల్లో భారీవర్షాలు కురిశాయి. లుపిట్ తుపాన్ ప్రభావం వల్ల జపాన్ దేశంలో బలమైన గాలులతో పాటు అధిక తరంగాలు వెలువడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.