మాఘ అమావాస్య జాతర

ABN , First Publish Date - 2022-02-02T06:14:06+05:30 IST

సిరిసిల్ల మానేరు తీరంలో శివనామం మారుమోగింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు గంభీరావుపేట, ముస్తాబాద్‌, కోనరావుపేట, ఇల్లంతకుంట, చందుర్తి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో మాఘమాస జాతరలో భాగంగా శివ కల్యాణాలు నిర్వహించారు.

మాఘ అమావాస్య జాతర
మల్లారెడ్డిపేట జాతరలో మంత్రి కేటీఆర్‌

 సిరిసిల్ల, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి):  సిరిసిల్ల మానేరు తీరంలో శివనామం మారుమోగింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు గంభీరావుపేట, ముస్తాబాద్‌, కోనరావుపేట, ఇల్లంతకుంట, చందుర్తి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో మాఘమాస జాతరలో భాగంగా శివ కల్యాణాలు నిర్వహించారు. మంగళవారం సిరిసిల్ల మానేరు వాగు లో గంగాభవాని, మడలేశ్వర, రామప్ప జాతర అత్యంత కన్నుల పండువగా సాగింది. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు, ఆప్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళలతో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొని పరమేశ్వరున్ని దర్శించుకున్నారు. మంత్రి కేటీఆర్‌ మల్లారెడ్డిపేట జాతర, సిరిసిల్ల జాతరలకు రావడంతో జనం తోసుకుంటూ మంత్రిని కలుసుకున్నారు. మంత్రితో సెల్ఫీలు దిగారు. కేటీఆర్‌ రావడంతో జాతరలలో సందడిగా మారింది.  గంగాభవాని జాతరలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ గాజుల నారాయణ, మాజీ చైర్మన్లు గూడూరి ప్రవీణ్‌, దార్నం లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి శివపార్వతులను దర్శించుకున్నారు. మడెళేశ్వరస్వామికి కల్యాణం జరగగా కొడిముంజ గుట్టల్లో చారిత్రాత్మకమైన రామప్ప గుడి మిడ్‌ మానేరు బ్యాక్‌ వాటర్‌లో మునిగిపోవడంతో సిరిసిల్ల శివారులో మిడ్‌మానేరు కరకట్ట కింద దేవాలయ పునర్‌నిర్మాణానికి కేటాయించిన స్థలంలో శ్రీ రామేశ్వరుడు పార్వతి కల్యాణం వైభవంగా జరిగింది. మూడు చోట్ల నాయిబ్రహ్మణులు, గంగపుత్రులు, రజక సంఘం ఆధ్వర్యంలో జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  

Updated Date - 2022-02-02T06:14:06+05:30 IST