Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్నదాతల్లో జవాద్‌ జడుపు

  వరి చేతికి అందే సమయంలో తుఫాన్‌ దడ 

 ఏ మేరకు ప్రభావం చూపుతుందోనని వణుకు

 పంటను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు 

 అప్రమత్తమైన అన్ని శాఖల అధికారులు 

 ముందస్తుగా ‘తాండవ’ నుంచి రెండు స్పిల్‌వే గేట్ల ద్వారా 1,200 క్యూసెక్కుల నీరు విడుదల  


మాకవరపాలెం/గొలుగొండ/ కృష్ణాదేవిపేట :   తుఫాన్‌పై వాతావ రణ శాఖ హెచ్చరికలు అన్నదాతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. శుక్ర వారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మబ్బు వాతా వరణం నెలకొన డం, ఆ తరువాత చిరు జల్లులు ప్రారం భం కావడంతో కలవరం అధికమైంది. ఇన్నాళ్లూ కష్టపడి పండించిన పంట చేతికి అందే సమ యంలో ప్రకృతి ఏం చేస్తుందోనని మద నపడుతున్నారు. పండిన వరి పంటను కాపాడుకునేం దుకు ఎవరికి తోచిన విధంగా వారు ప్రయత్నాలు తీవ్రం చేశారు. మాకవరపాలెం మండలంలోని మాకవరపాలెం, తామరం, పైడిపాల, గిడుతూరు, కొండలఅగ్రహారం, లచ్చన్నపాలెం తదితర గ్రామాల్లో ఇప్పటికే వరి కోతలు కోశారు. ఆకాశంలో మబ్బు పట్ట డాన్ని చూసి పొలాల్లోని కల్లాల్లో కుప్పలు వేస్తు న్నారు. పలు లోతట్టు ప్రాంతాల్లో తహ సీల్దార్‌ రాణిఅమ్మాజీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. తామరం,  కొండలఅగ్రహారం, తాడపాల, నారాయణరాజుపేటల్లో వర్షా కాలంలో ముం పునకు గురయ్యే ప్రాంతాల్లో  పర్య టించి,  వర్షపు నీరు బయటకు పోయే విధంగా జేసీబీ సహా యంతో కాలు వలు తవ్వించారు. ఇదిలావుంటే, గొలుగొండ మండలంలో పదకొండు వందల హెక్టార్లలో వరి పంట సాగులో ఉంది. ఇప్పటికే గొలుగొండ, సీహెచ్‌.నాగాపు రం, పాతకృష్ణాదేవిపేట, కొంగసింగి, విప్పలపాలెం, చోద్యం, లింగంపేట, గిం జర్తి తదితర గ్రామాల్లో సుమారు ఎనభై హెక్టార్లలో పంటను రైతులు కోయగా, జోగంపేట, పాకలపాడు, రావణాపల్లి, ఏటిగైరంపేట తదతర గ్రామా ల్లోమరో నాలుగు వందల హెకా ్టర్లలో కోతకు సిద్ధంగా ఉంది. ఈ తుణంలో తుఫాన్‌ వస్తుండడంతో దీని ప్రభావం పంటపై ఎలా ఉంటుందోనని రైతులు ఇందోళన చెందుతున్నారు.  ప్రస్తుతం వరి కోతలు కోయవద్దని   వ్యవసాయా ధికారులు పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.  


‘తాండవ’ నుంచి  1,200 క్యూసెక్కులు విడుదల

నాతవరం: తుఫాన్‌ను ఎదుర్కొనేం దుకు రెవెన్యూ యంత్రాంగం అప్రమ త్తమైంది. ఇందులో భాగంగా నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు, నాతవరం తహసీల్దార్‌ జానకమ్మ మండలంలోని పలుచోట్ల గురు, శుక్రవారాల్లో పర్యటించారు. ప్రధానంగా తాండవ రిజర్వాయర్‌ డీఈ రాజేంద్రకుమార్‌కు సూచనలు చేసిన నేపథ్యంలో ఆయన సిబ్బంది ద్వారా శుక్రవారం సాయంత్రం రెండు స్పిల్‌వే గేట్లు ఎత్తి 1200 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేశారు. రిజర్వా యర్‌ గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా, ప్రస్తుతం 378 అడుగుల నీటి నిల్వలు ఉండడంతో ఈ చర్యలు చేప ట్టారు. ఈ సందర్భంగా డీఈ మాట్లా డుతూ ప్రస్తుతం రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో ద్వారా 600 క్యూసెక్కుల నీరు వస్తుందని చెప్పారు.  లోతట్టు ప్రాం తాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలావుంటే, గన్నవరం వద్ద తుని- నర్సీపట్నం రూట్‌లో గతంలో వరదల సమయాల్లో వెర్రిగెడ్డ ఉధృతికి కారు కొట్టుకుపొయి, ఓ వ్యక్తి మృతిచెందిన ప్రాంతాన్ని ఆర్డీవో గోవిం దరావు పరిశీలించారు. తుఫాన్‌ సమ యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారు లకు వివరించారు.  

Advertisement
Advertisement