జవాన్‌ మహేష్‌ కుటుంబానికి చేయూత

ABN , First Publish Date - 2021-01-18T04:52:33+05:30 IST

దేశ సరిహద్దులో శత్రువులతో పోరాడి అసువులు బాసిన వీర జవాన్‌ ర్యాడ మహేష్‌ కు టుంబానికి కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌ గ్రామస్థులు త మవంతు చేయుతనందించారు.

జవాన్‌ మహేష్‌ కుటుంబానికి చేయూత

కమ్మర్‌పల్లి, జనవరి 17: దేశ సరిహద్దులో శత్రువులతో పోరాడి అసువులు బాసిన వీర జవాన్‌ ర్యాడ మహేష్‌ కు టుంబానికి కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌ గ్రామస్థులు త మవంతు చేయుతనందించారు. ఈ మేరకు గ్రామ యువ కులు గ్రామంలో విరాళాలు సేకరించి రూ.68 వేల పోగు చేసి వీర జవాన్‌ స్వగ్రామం వేల్పూర్‌ మండలం కోమన్‌ పల్లిలో ఉన్న ఆయన కుటుంబసభ్యలకు  ఆదివారం అంద జేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రాణత్యాగం చేసిన మహేశ్‌కు శ్రద్ధంజలిఘటించారు. వారికుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. 


Updated Date - 2021-01-18T04:52:33+05:30 IST