జయశంకర్‌ సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2021-06-22T07:06:00+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్ధాంత కర్త, ప్రొఫెసర్‌ జయశంకర్‌ చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్‌ మందుల సామేల్‌ అన్నారు.

జయశంకర్‌ సేవలు మరువలేనివి
భువనగిరిలో జయశంకర్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న నాయకులు

భువనగిరి టౌన్‌, జూన్‌ 21: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్ధాంత కర్త, ప్రొఫెసర్‌ జయశంకర్‌ చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్‌ మందుల సామేల్‌ అన్నారు. జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా మోత్కూ రు అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి సోమవారం పూలమా లలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ తీపిరెడ్డి మేఘారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పొన్నెబో యిన రమేష్‌, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ బొల్లెపల్లి వెంకటయ్య, కౌన్సిలర్‌ కల్యాణ్‌చక్రవర్తి, యాకూబ్‌రెడ్డి, కొండ సోంమల్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు. వలిగొండ మండలంలోని నాగారం గ్రామంలో విశ్వబ్రాహ్మ ణ, విశ్వకర్మ ఐక్యవేదిక నాయకులు జయశంకర్‌ విగ్రహానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలోని స్వర్ణకార సంఘం భవనంలో జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జాయింట్‌ సెక్రటరీ కొండపర్తి బాలా చారి, మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వెంకటనారాయణచారి, నాయకులు దాసోజు వెంకటేశ్వరా చారి, కన్నెకంటి స్వామిచారి, దాసోజు పాండరాచారి, నర్సింహాచారి, శ్రీనివాసాచారి, రుషికేష్‌ పాల్గొన్నారు. చౌటుప్పల్‌ ఏఎంసీ కార్యాలయ ంలో జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. అదేవిధంగా గ్రంథాలయంలో చైర్మన్‌ ఊడుగు మల్లేష్‌, తంగడపల్లిలో మాజీ సర్పంచ్‌ ఎం.దయా కరాచారి ఆధ్వర్యంలో జయశంకర్‌ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆర్టీఏ మెంబర్‌ తడక కిరణ్‌, షాదీఖాన చైర్మన్‌ ఎండీ.రహీం, మార్కెట్‌ డైరెక్టర్‌ సుర్కంటి నవీన్‌రెడ్డి పాల్గొన్నారు. మోత్కూరులో జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి బీఆర్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌ పూలమా లలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు గజ్జి లింగమ ల్లు, అన్నందాసు మత్స్యగిరి, దొంతోజు యాదగిరి, బొడ్డుపల్లి సర్వయ్య, పి.యాదగిరి, నయీమ్‌, నరేష్‌, సోమన్న పాల్గొన్నారు. భువనగిరిలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జయశంకర్‌ సార్‌ వర్ధంతి కార్యక్రమంలో చైర్మన్‌ జడల అమరేందర్‌గౌడ్‌, గ్రంధాలయ అధి కారి సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సం ఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో సంఘం నాయకులు సతీష్‌, వెల్దుర్తి రఘునాధ్‌, దేవరకొండ నర్సింహాచారి పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-22T07:06:00+05:30 IST