రైతు దినోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన జేసీ

ABN , First Publish Date - 2021-07-08T05:42:23+05:30 IST

భీమడోలులో గురు వారం రైతు దినోత్సవం నిర్వ హిం చేందుకు ఏర్పాట్లు చేసినట్టు జేసీ వెంకట రమణారెడ్డి తెలిపారు.

రైతు దినోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన జేసీ
భీమడోలు హైస్కూలులో కూలిన సభా వేదిక

భీమడోలు, జూలై 7: భీమడోలులో గురు వారం రైతు దినోత్సవం నిర్వ హిం చేందుకు ఏర్పాట్లు చేసినట్టు జేసీ వెంకట రమణారెడ్డి తెలిపారు. భీమ డోలు లో గురువారం ప్రారం భం కానున్న ఆక్వా, అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ల ను ఆయన సందర్శించారు. భీమడోలు హైస్కూల్లో నిర్వహించే రైతు దినోత్సవ సభ ఏర్పాట్లను పరిశీ లించారు. ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌ను సీఎం వర్చువల్‌ విధానంలో ప్రారంభిస్తారని మత్స్యశాఖ ఏడీ తిరుపతయ్య తెలిపారు. మంత్రులు ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌, పేర్ని వెంక ట్రామయ్య, కురసాల కన్నబాబు, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పాల్గొంటారన్నారు. భీమడోలు జడ్పీ హైస్కూలులో ఏర్పాటు చేసిన సభావేదిక బుధ వారం మధ్యాహ్నం కొద్దిపాటి ఈదురుగాలులు, వర్షానికి నేల కూలడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.


Updated Date - 2021-07-08T05:42:23+05:30 IST