కొత్త విధానంలో ధాన్యం కొనుగోలు

ABN , First Publish Date - 2021-10-09T07:03:08+05:30 IST

భానుగుడి(కాకినాడ), అక్టోబరు 8: జిల్లాలో 2021-22 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొను గోలు ప్రక్రియ కొత్త విధానంలో జరగనుందని, ఇక నుంచి 1,018 రైతు భరోసా కేంద్రాలు ప్రధాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు(పీసీసీ)గా పనిచేస్తాయని జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) జి

కొత్త విధానంలో ధాన్యం కొనుగోలు
కలెక్టరేట్‌ కోర్టు హాలులో అధికారులతో సమావేశం నిర్వహించిన జేసీ లక్ష్మీశ

సేకరణ కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు : జేసీ లక్ష్మీశ 

భానుగుడి(కాకినాడ), అక్టోబరు 8: జిల్లాలో 2021-22 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొను గోలు ప్రక్రియ కొత్త విధానంలో జరగనుందని, ఇక నుంచి 1,018 రైతు భరోసా కేంద్రాలు ప్రధాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు(పీసీసీ)గా పనిచేస్తాయని జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) జి లక్ష్మీశ తెలి పారు. శుక్రవారం కలెక్టరేట్‌ కోర్టుహాల్‌లో జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సమావేశం జరిగింది. పౌర సరఫరాల కార్పొరేషన్‌, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, ఎఫ్‌సీఐ, తూనికలు-కొలతలు, రవాణా, కార్మిక తదితర శాఖలకు చెందిన అధికారులతోపాటు రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు ఈ సమావేశానికి సబ్‌కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, ఆర్‌డీవోలు వర్చువల్‌ విధానంలో హాజరయ్యారు. ధాన్యం సేకరణ, సన్నద్ధత కార్యకలాపాలు, మద్దతు ధరలు, నాణ్యాతా ప్రమాణాలు, సేకరించిన ధాన్యం మిల్లులకు తరలింపు తదితర అంశాలపై చర్చించారు. ఈ సంద ర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ 2021-22 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి స్థానిక విని యోగంపోను దాదాపు 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందన్నారు.


సాధారణ రకానికి క్వింటాకు రూ.1,940 ఏ గ్రేడ్‌ రకానికి రూ.1,960 కనీస మద్దతు ధరగా ఉందని, 75 కిలోల బస్తాకు సాధారణ రకానికి రూ.1,455, ఏ గ్రేడ్‌ రకానికి రూ.1,470 ఎంఎస్‌పీ లభిస్తుందని వివరించారు. నాణ్యతా ప్రమాణాలు, మద్దతు ధర తదితర సమాచారాన్ని రైతులకు అందించేందుకు ఆర్‌బీకేల వద్ద ఆర్‌బీకే, పీపీసీ సహాయకులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాల్సిందేనన్నారు. ఈ క్రాప్‌ వెరిఫికేషన్‌, ఈ-కేవైసీ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని, వ్యవసాయశాఖ అధికారులను జేసీ ఆదేశించారు. రైతులు తమ సమీప ఆర్‌బీకేల వద్ద ధాన్యం సేకరణ పోర్టల్‌లో తమ భూమి, బ్యాంకు ఖాతా, వివరాలు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. ఽధాన్యం సేకరణకు సంబంధించి జిల్లా స్థాయిలో 0884-6454341 నెంబరుతో ప్రత్యేక కంట్రోల్‌ రూం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, సివిల్‌ సప్లై మేనేజరు ఈ లక్ష్మీరెడ్డి, డీఎస్‌వో పీ ప్రసాదరావు, డీడీ(ఏ) వీటీ రామారావు, మార్కెటింగ్‌  ఏడీ కె సూర్యప్రకాశ్‌రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ఏ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-09T07:03:08+05:30 IST