జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2021-10-17T05:26:27+05:30 IST

జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు 14 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించారని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల జిల్లా సమన్వయ అధికారిణి పి.సుజాత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

ఏలూరు సిటీ/చాగల్లు/పాలకొల్లు అర్బన్‌,  అక్టోబరు 16 : జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు 14 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించారని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల జిల్లా సమన్వయ అధికారిణి పి.సుజాత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్ఫూర్తి కార్యక్రమం ద్వారా ఫిబ్రవరి 2021 నుంచి మే–2021 వరకు నాలుగు సెషన్స్‌లో జరిగిన  జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో 14 మంది అడ్వాన్స్‌డ్‌లో అర్హత పొందారు. మెయిన్స్‌కు 205 మందికి స్పెషల్‌ కోచింగ్‌ ఇవ్వగా 147 మంది అర్హత సాధించారన్నారు. నరసాపురం గురుకుల విద్యార్థి భంటు తరుణ్‌ ఆల్‌ఇండియా ఎస్‌సీ కేటగిరిలో 507వ ర్యాంకు సాధించి గురుకుల విద్యాలయాల్లో ప్రథమ స్థానంలో నిలిచాడని ఆమె తెలిపారు.  


వెంకటరత్న సాయికుమార్‌కు 21వ ర్యాంకు..


చాగల్లుకు చెందిన ప్రగళ్లపాటి వెంకట రత్నసాయికుమార్‌  జేఈఈ అడ్వాన్స్‌లో 21వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు బాపూజీరావు, మీనాక్షి సహా గ్రామ పెద్దలు పలువురు అభినందనలు తెలిపారు. ముంబై ఐఐటీలో చేరి కంప్యూటర్‌ సైన్సు చేయాలనేది తన లక్ష్యమని కుమార్‌ తెలిపాడు.


కార్తికేయకు 33వ ర్యాంకు  


పాలకొల్లు  పట్టణా నికి చెందిన సత్తి కార్తికేయ జాతీయ స్థా యిలో జరిగిన జేఈఈ అడ్వాన్స్‌ (జనరల్‌ కేటగిరి) 33వ ర్యాంకు సాధించాడు. ఎల్‌ఆర్‌ పేటకు చెందిన సత్తి త్రినాథరావు, మోహనకృష్ణ కుమారి రెండో కుమారుడు కార్తికేయ తెలంగాణ ఎంసెట్‌లో మొదటి ర్యాంక్‌, ఏపీ ఈసెట్‌లో 9వ ర్యాంకు, జేఈఈ మొయిన్స్‌లో జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు సాధించాడు. 

Updated Date - 2021-10-17T05:26:27+05:30 IST