బెజోస్ కుక్కపిల్లలాంటోడు.. అలసటనేదే కనిపించేది కాదు: మాజీ ఉద్యోగి

ABN , First Publish Date - 2021-07-07T03:40:40+05:30 IST

అమెజాన్ అనే మహావ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యక్తి జెఫ్ బెజోస్. ఇటీవల ఆయన అమెజాన్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

బెజోస్ కుక్కపిల్లలాంటోడు.. అలసటనేదే కనిపించేది కాదు: మాజీ ఉద్యోగి

న్యూఢిల్లీ: అమెజాన్ అనే మహావ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యక్తి జెఫ్ బెజోస్. ఇటీవల ఆయన అమెజాన్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో బెజోస్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. చిన్న వయసులోనే ఆయన అమెజాన్‌ను స్థాపించిన విషయం తెలిసిందే. కాగా.. 1999లో బెజోస్ అమెజాన్‌ సంస్థను సియాటెల్‌లో ఉన్న 16 అంతస్తుల మిలిటరీ భవనంలోకి మార్చారు. అప్పటికి ఆయన వయసు ముప్పై దాటింది. ఆ సమయంలో బెజోస్‌కు అసిస్టెంట్‌గా పనిచేసిన ఆన్ హయట్.. ఆయనలోని ఎనర్జీని చూస్తే ఆశ్చర్యమేసేదని ఇటీవల పేర్కొన్నారు. బెజోస్ కార్యాలయం 14వ అంతస్తులో ఉండగా.. ప్రతిరోజు ఆయన మెట్లెక్కి తన కార్యాలయానికి చేరుకునే వారని హయట్ తెలిపారు. లిఫ్ట్ ఎక్కేందుకు ఇష్టపడేవారే కాదని ఆమె చెప్పుకొచ్చారు. ఏకబిగిన అన్ని అంతస్తులు ఎక్కినప్పటికీ.. అసలు ఏమాత్రం అలసిపోయినట్టు కనిపించే వారు కాదని ఆమె పేర్కొన్నారు. ‘‘బెజోస్ కుక్కపిల్లలాంటోడు. ఎంత తిరిగినా అలసిపోయినట్టు కనిపించేవారే కాదు..ఆయన్ను ఆపగలిగేదీ ఏది లేదేమో అనిపించేది’’ అంటూ హయట్ నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. 2002 నుంచి 2005 వరకూ బెజోస్‌కు హయట్ అసిస్టెంట్‌గా పనిచేశారు.

Updated Date - 2021-07-07T03:40:40+05:30 IST